"ఓజీ" ప్రీక్వెల్‌లో మెగా పవర్ స్టార్.. స్టోరీ ఇదే..!!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "ఓజీ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇన్నాళ్లు పవన్ ని ఎలా అయితే చూడాలి అనుకుంటున్నామో.. అలా చూపించారు అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది ఈ మూవీ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ అనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.
కాగా ఈ మూవీలో ప్రముఖ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. అలానే శ్రేయ రెడ్డి , శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్ ఇలా పలువురు కీలక పాత్రల్లో మెప్పించారు, ఇక ఈ మూవీ సక్సెస్ లో మూజిక్ డైరెక్టర్ తమన్ కీలకపాత్ర పోషించారు.

పవర్ స్టార్ యాక్టింగ్.. సుజిత్ టేకింగ్.. తమన్ మ్యూజిక్ అన్ని కలిపి థియేటర్లు బ్లాస్ట్ అయ్యేలా చేస్తున్నాయి. కాగా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సీక్వెల్ వస్తే ఎలాంటి కథతో వస్తుందని అందరూ ఆలోచనలో పడగా.. డైరెక్టర్ సుజీత్ సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
ప్రీక్వెల్ స్టోరీ రివీల్..
అంతేకాకుండా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రీక్వెల్ స్టోరీ కూడా రివీల్ చేసేశారు. సుజీత్ మాట్లాడుతూ..ప్రీక్వెల్ కథ సిద్ధంగా ఉంది. ఇది సుభాష్ చంద్రబోస్ ఇండియా నుండి ప్రజలను జపాన్ కి ఎలా తీసుకెళ్లాడు? ఆ కాలంలో ఏం జరిగింది? అనే అంశాలతో రాబోతోంది అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంటూ క్లారిటీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

అసలు ట్విస్ట్ ఇదే..
అయితే ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.. ప్రీక్వెల్ మూవీలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆయన అయితేనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారని, అందుకే సుజీత్ పక్కాగా ప్లాన్ చేసి మరీ అమితాబ్ ను కలిసి.. కథ వినిపించి ఈ పాత్రకు ఒప్పించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ తండ్రి క్యారెక్టర్ లో రామ్ చరణ్ నటించనున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది.
గతంలో చరణ్ తో సుజిత్ సినిమా క్యాన్సిల్ అవ్వడం.. అలానే ఓజీ మూవీలో జపాన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూపించే ఫొటోల్లో పవన్ తల్లిదండ్రుల ఫోటోలలో చరణ్ పోలికలు ఉండడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాకు ప్రభాస్ "సాహో" సినిమాను కూడా లింకు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక కలెక్షన్ల సునామీ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సుజిత్ మళ్లీ ఏం మ్యాజిక్ చేస్తారో వేచి చూడక తప్పదు.












Click it and Unblock the Notifications