పర్సంటేజ్ ఇవ్వకపోతే "పెద్ది" షోలు వేయం: ఎగ్జిబిటర్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం "పెద్ది". ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ విషయంలో ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ఎమోషన్స్‌ను కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్రబృందం భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. బాలీవుడ్ మీడియా సైతం 'పెద్ది'పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడం విశేషం.

ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ డిమాండ్‌తో కొత్త ట్విస్ట్..
ఇదిలా ఉంటే రిలీజ్‌కు ముందు 'పెద్ది' సినిమా చుట్టూ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఈ సినిమాకు సంబంధించి 'పర్సంటేజ్ సిస్టమ్' అమలు చేయాలని డిమాండ్ చేసింది. నిర్మాతలు ముందుగా వాటా విధానం స్పష్టత ఇవ్వాలని, అప్పుడే రాష్ట్రంలో సినిమాను ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఈ ప్రకటన ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. భారీ సినిమాల వసూళ్లలో థియేటర్లకు సరైన వాటా దక్కడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మరోవైపు ఉత్తర భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భోపాల్‌లో మరో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండటంతో మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీను కూడా ప్రమోషన్స్‌కు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అలానే జూన్ 2న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అభిమానుల కోసం ప్రత్యేక స్టేజీ డిజైన్లు, లైవ్ పెర్ఫార్మెన్స్‌లు, భారీ విజువల్ షో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తతో మెగా, నందమూరి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రెండు స్టార్ కుటుంబాల అభిమానులు ఒకే వేదికపై సంబరాలు చేసుకునే అరుదైన క్షణంగా ఈ ఈవెంట్ నిలవబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పటికే #Peddi, #RamCharan, #NBK వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications