రామ్ చరణ్‌కి బిగ్ షాక్.. పెద్ది షూటింగ్‌కి బ్రేక్ !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది.
గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో లో ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ముఖ్యంగా రామ్‌చరణ్ కొట్టే ఐకానిక్ ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. అలానే ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. చరణ్ నటించిన గత చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా వారందరికీ అనుకోని షాక్ తగిలింది. పెద్ది షూటింగ్ కి బ్రేక్ పడింది.

షూటింగ్‌కి బ్రేక్..
ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయినట్లు అంటున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రాథేయకంగా వేసిన వేసిన సెట్ కూడా వేశారు. కానీ భారీ వర్షాల కారణంగా షూటింగ్ చేయడం ఇబ్బందిగా మారిందని టాక్ వినిపిస్తుంది.
ఔట్‌డోర్‌లోనే షూటింగ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేయగా.. అనుకోని పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మళ్లీ వర్షాలు తగ్గగానే షూటింగ్ షురూ అవుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications