అల్లు అర్జున్‌ను బ్లాక్ చేసిన రామ్ చరణ్, అల్లు బంధానికి స్వస్తి..?
మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ రెండు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు మొదలైయ్యాయి.
వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు.మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమా సమయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా కూటమి ఎమ్మెల్యేలు,మెగా అభిమానులు మాట్లాడటం జరిగింది. మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెబితేనే , 'పుష్ప-2' సినిమాను ఏపీలో విడుదల అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు.
'పుష్ప-2' సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ , మెగా హీరోలెవ్వరూ కూడా స్పందించలేదు.అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో కూడా మెగా ఫ్యామిలీ సెలైంట్‌గానే ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. ఇటీవలే 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ గురించి అల్లు అరవింద్ సెటైర్లు వేయడం జరిగింది.
ఈక్రమంలోనే రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. ఈ ఘటనతో మరోసారి ఈ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అన్‌ఫాలో చేయడంతో , ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరిగినట్టు అయింది. మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన మాత్రం అల్లు అర్జున్‌ను ఫాలో అవుతూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications