రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరో ఏడాది ఆగాల్సిందేనా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గతేడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో అలరించారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దాంతో చెర్రీ ఫ్యాన్స్ ఇప్పుడు ఆశలు మొత్తం పెద్ది చిత్రంపైనే పెట్టుకున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న పెద్ది చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈ సారి రామ్ చరణ్ కు బ్లాక్ బస్టర్ పక్కా అని అటు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు లెక్కలేసుకుంటున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది పై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. చికిరి చికిరి సాంగ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 27 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఇంతలోనే ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినట్లు సమాచారం. దాంతో మార్చిలో విడుదల కావాల్సిన పెద్ది కాస్తా డిసెంబర్ కు వెళ్లినట్లు సమాచారం.
ఈ సినిమా వాయిదాకు ప్రధానంగా సాంకేతిక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాబట్టి హడావిడిగా రిలీజ్ చేయడం కాకుండా ఒక మాస్టర్ పీస్ గా మార్చేందుకు టీమ్ కృషి చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ క్రిస్మస్, ఇయర్ ఎండ్ సీజన్ కావడంతో వసూళ్లు భారీగా వస్తాయని టీమ్ భావిస్తోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ చిత్రం తర్వాత సుకుమార్ తో ఓ కౌ బాయ్ చిత్రం చేయనున్నారు చెర్రీ. ఇక పెద్ది మూవీకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే పెద్ది మూవీలో జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications