బాలయ్య రికార్డును తుడిచిపెట్టేసిన 'డబుల్ ఇస్మార్ట్'!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని కథానాయకుడిగా వచ్చిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. షరా మాములుగానే లైగర్ సినిమా మిగిల్చినట్లుగానే డబుల్ ఇస్మార్ట్ కూడా భారీ నష్టాలను మిగిల్చింది. ఆగస్టు 15వ తేదీన డబుల్ ఇస్మార్ట్ తోపాటు విడుదలైన మిస్టర్ బచ్చన్ కూడా ఇంతకంటే ఘోరంగా ఫ్లాపైంది. ఆ సినిమా ఆడకపోవడంవల్ల డబుల్ ఇస్మార్ట్ కు కలెక్షన్లు పెరుగుతాయని ఆశించారుకానీ అది జరగలేదు.
ఈ సినిమా థియేటర్ హక్కులు రూ.50 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇస్మార్ట్ శంకర్ మీద ఉన్న నమ్మకంతో బయ్యర్లు దీనికి భారీగా ఖర్చుపెట్టారు. అయితే నిర్మాతతోపాటు హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు అందులో కనీసం 25 పైసలు కూడా తిరిగిరాలేదు. విడుదలైన మొదటి రెండురోజుల్లో కేవలం రూ.11 కోట్లు రాబట్టింది. సినిమాకు అయిన ఖర్చులో తిరిగివచ్చింది 22 శాతం అంటే ఎంత దారుణంగా ఫ్లాపైందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను కొనుగోలు చేసిన నిర్మాత నిరంజన్ రెడ్డికి హనుమాన్ సినిమాద్వారా వచ్చిన లాభాలన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. భారీ నష్టాలు మిగిల్చిన చిత్రం మరో రికార్డును ఈ సినిమా సాధించింది.

గతంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వచ్చింది. క్రిష్ దర్శకుడు. ఇది కేవలం 28 శాతమే రికవరీ చేసింది. ఆ సమయంలో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ రికార్డును రామ్ సినిమా తుడిచిపెట్టేసింది. ఈ సినిమా తర్వాత పూరీ దర్శకత్వంలోనే వచ్చిన లైగర్ 41 శాతాన్ని రాబట్టింది. చిరంజీవి హీరోగా వచ్చిన భోళాశంకర్ సినిమాకు 33 శాతం, ఆచార్య సినిమాకు 35 శాతం రాబట్టగా, రాధేశ్యామ్ సినిమా 40 శాతం మాత్రమే రాబట్టాయి. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఆడకపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఉచితంగానే ఇచ్చారు.












Click it and Unblock the Notifications