రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్‌లో ఈ తప్పులను గమనించారా?
రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెలుగులోనే కాకుండా పలు భాషల్లో సైతం ఇప్పటికే ఎన్నో చిత్రాలు తెరకెక్కి ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు మళ్లీ మరోసారి బాలీవుడ్ లో భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో "రామాయణ" పేరుతో మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాక్‌స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే రవి దుబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కాగా సంగీత దర్శకులుగా హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ వ్యవహరిస్తున్నారు. అలానే శ్రీధర్ రాఘవన్ రచయితగా పని చేస్తుండగా.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని 2025 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ. 2,000 కోట్ల నుంచి రూ. 4,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ టీజర్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేశారు.

ఈ మూవీ టీజర్ చాలా రిచ్ గా, గ్రాండియర్ గా ఉంది. దాంతో విజువల్ గ్రాండియర్ గా రామయణం సినిమా ఉండనుందని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల వీఎఫ్‌ఎక్స్ మరీ నాసిరకంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే టీజర్ లోనూ కొన్ని తప్పులు ఉన్నాయని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే దానికిఅన్ని రకాలుగా సిద్ధమవ్వాలి. దర్శకుడికి చాలా ముందుచూపు ఉండాలి. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారించాలి. లేకపోతే నేటి సోషల్ మీడియా యుగంలో ఈజీగా దొరికిపోతారు.
ఇప్పుడు, 'రామాయణం' టీజర్‌లో కొన్ని తప్పులు బయటపడటంతో, దర్శకుడు నితేష్ తివారీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. టీజర్ లో రాముడు జనంలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక సన్నివేశం ఉంది. అప్పుడు ఒక బాలుడు నమస్కరిస్తాడు. రాముడు మరికొంత ముందుకు వెళ్లగానే అదే బాలుడు రాముడిపై పువ్వులు విసురుతూ కనిపిస్తాడు. నెటిజన్లు దీనికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రామాయణం టీమ్ ను ట్రోల్ చేస్తున్నారు. మరో సీన్ లో రాముడు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాడు.
అయితే సైనికులు మాత్రం ఎటో చూస్తున్నట్టుగా నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. నితేష్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. అలాగే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది. కన్నడ స్టార్ యశ్ రావణుడిగా యాక్ట్ చేస్తున్నారు. మొత్తం రెండు పార్టులుగా ఈ మూవీ తెరకెక్కనుంది. మొదటి భాగం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
First frame: kid is bowing down and ranbir crossed him
— Raj (@idfcwau) April 2, 2026
Next frame: same kid is showering flowers on him
And we're competing with Hollywood with these AI videos in big 2026 🤡🙏#Ramayana pic.twitter.com/TgSOAbCmUE












Click it and Unblock the Notifications