రావణాసురా.. ఆ సీతమ్మ కోసం అంత ఆరాటమెందుకురా? మండోదరిని చూశావా లేదా!

ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కించిన దృశ్యకావ్యం 'రామాయణ'(పార్ట్-1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది. రిలీజైన 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలో మండోదరి పాత్రను పోషించిన ప్రముఖ దక్షిణాది నటి కాజల్ అగర్వాల్ తన పాత్రకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

'రామాయణ' మూవీలో డిలీటెడ్ సీన్ వైరల్.. యాడ్ చేయాలంటున్న ఫ్యాన్స్
'రామాయణ' మూవీలో డిలీటెడ్ సీన్ వైరల్.. యాడ్ చేయాలంటున్న ఫ్యాన్స్

మండోదరిగా కాజల్ అద్భుత రాజసం
సినిమాలో లంకేశ్వరుడైన రావణాసురుడి(యష్) భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించారు. రాయల్ రెడ్, పింక్, మెరూన్ రంగుల దుస్తులలో శిరస్సుపై భారీ స్వర్ణ మకుటం, సాంప్రదాయ ఆభరణాలు ధరించి అత్యంత రాజసంతో కాజల్ మెరిసిపోతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ కాజల్ అగర్వాల్ భావోద్వేగమైన క్యాప్షన్ జోడించారు. " కొన్ని సినిమాల్లో మన పాత్ర నిడివి ఎంత లేదా స్క్రీన్‌పై ఎంత సమయం కనిపించామనేది ముఖ్యం కాదు. ఆ కథలోని గ్రాండియర్, దాని వెనుక ఉన్న తపన, మన సంస్కృతి, దైవత్వంతో ముడిపడి ఉన్న ఓ గొప్ప ప్రాజెక్టులో భాగం కావడం అత్యంత అదృష్టంగా భావిస్తున్నాను. నా చిన్నదైనా అర్థవంతమైన ఈ పాత్రను ఇంతగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని కాజల్ పేర్కొన్నారు.

Ramayana Part 1 Kajal Aggarwal as Mandodari Look Viral Fans Compare With Sai Pallavi as Sita

సాయి పల్లవితో పోలికలు.. సోషల్ మీడియా నెటిజన్ల కామెంట్లు
కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ రాయల్ ఫోటోలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సినిమాలో సీతమ్మగా నటించిన సాయి పల్లవి లుక్‌తో కాజల్ అగర్వాల్ మండోదరి లుక్‌ను పోలుస్తూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. "కాజల్ ఈ లుక్ లో సీతాదేవిగా నటించిన సాయి పల్లవి కంటే చాలా రాయల్‌గా ఉన్నారు", "ఇంతటి సౌందర్యవతి అయిన మండోదరిని వదిలి రావణుడు సీత వైపు ఎందుకు వెళ్లాడో!" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పవిత్రమైన రామాయణానికి ఇదేం ప్రమోషన్? వైరల్ అవుతున్న ఫొటోలు!
పవిత్రమైన రామాయణానికి ఇదేం ప్రమోషన్? వైరల్ అవుతున్న ఫొటోలు!

ఈ సినిమాలో నటించడం గురించి కాజల్ ఏమన్నారంటే?
గతంలో వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'రామాయణ' సెట్‌లో పనిచేయడం తనకు సరికొత్త అనుభవమని వెల్లడించారు. ఈ సినిమాలో ఉపయోగించిన అత్యాధునిక విజువల్ టెక్నాలజీ భారతీయ ప్రేక్షకులకు నభూతో నభవిష్యత్ అనే రీతిలో సరికొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పారు.

భారీ తారాగణం, బాక్సాఫీస్ సునామీ
నవంబర్ 5న విడుదలైన ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా యష్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్‌తో పాటు అనుపమ్ ఖేర్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, లారా దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. రిలీజ్ అయిన తొలి ఆదివారానికే అంతర్జాతీయంగా రూ.499 కోట్ల వసూళ్లు సాధించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+