'పుష్ప 2' రికార్డులు బద్దలు.. ఇక విధ్వంసమే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 ది రూల్ గతేడాది డిసెంబర్ 5 విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ. 400 కోట్లకుపైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1700 కోట్ల వరకు కలెక్ట్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతకుముందు ఉన్న బాహుబలి 2 రికార్డుల్ని చాలా చోట్ల ఈ మూవీ దాటేయడం విశేషం. అయితే ఇటీవల విడుదలైన దురంధర్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో.. యూరీ : ది సర్జికల్ స్ట్రైక్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వచించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. రోజురోజుకూ కలక్షన్లు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఈ చిత్రం దేశంలోనే రూ.300 కోట్ల వరకు వసూల్లు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. ఈ క్రమంలో పుష్ప-2 రికార్డులను కూడా ఈ మూవీ దాటేయడం విశేషం.
పుష్ప 2 చిత్రానికి రెండో శుక్రవారం రూ. 27 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక దురంధర్ చిత్రానికి ఏకంగా రూ. 34 కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి 8 రోజుల్లో 252 కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెండో వారం లెక్కలు చూస్తే పుష్ప-2 , యానిమల్ రికార్డుల్ని ఈ దురంధర్ మూవీ బద్దలు కొట్టినట్లు స్పష్టం అవుతోంది. వీకెండ్స్ , వర్కింగ్ డేస్ అని తేడా లేకుండా ఈ మూవీ దుమ్ము లేపుతోంది.

ఇక ఆదిత్య ధర్ ర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ అర్జున్ రామ్ పాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సారా అర్జున్ కీలక నటులు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రానికి గల్ఫ్ కంట్రీస్ షాక్ ఇచ్చాయి. ఈ చిత్రంలో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నందున గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఎఈలలో ప్రదర్శనను నిలిపివేశారు. మూవీ కలెక్షన్స్ పై ఇది కాస్త భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications