బై బై రష్మీ... గుడ్ బై!
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ఇందులో పనిచేసేవారంతా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినిమాల్లో హీరో హీరోయిన్ల తర్వాత ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ను జబర్దస్త్ కార్యక్రమానికి చేసేవారు సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే జడ్జిలు తప్పుకున్నారు. యాంకర్ అనసూయ కూడా బుల్లితెరకు బైబై చెప్పి వెండితెరపై సందడి చేస్తోంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీగౌతమ్ యాంకరింగ్ చేస్తున్నారు.
ఆరా తీస్తున్న నెటిజన్లు : రష్మీ కూడా గుడ్ బై చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఎందుకు వెళ్లిపోవాలనుకుంది? అనే విషయమై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. షోకి రేటింగ్ తగ్గేసరికి మల్లెమాల యాజమాన్యం పారితోషికం విషయంలో కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రష్మీ బయటకు వెళ్లిపోవాలనుకుంటున్నట్లు సమాచారం. తనకు ఈ షో ఎంతో మంచిపేరు తెచ్చిందంటూ ఎక్కువ కాలం కొనసాగుతుంది కానీ ఇష్టం లేకపోయినా తప్పని సరి పరిస్థితుల్లో వెళ్లిపోతోందట. వేరే ఛానల్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి.

అనసూయ బాటలో : అనసూయనే రష్మీ ఫాలోఅవుతోంది అనుకుంటున్నారు. అదే షో, అదే కామెడీ అనేసరికి కొన్నిరోజులకు ఆడియన్స్ లో ఒకరకమైన మొనాటనీ వచ్చేస్తుందని, ఎక్కువ కాలం కొనసాగితే ఫాలోయింగ్ దెబ్బతింటుందని భావించింది. దీంతో వేరే ఛానల్ లో వేరే కార్యక్రమానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. సుడిగాలి సుధీర్, బలగం వేణు, గెటప్ శీను లాంటివారంతా వెండితెరపై కూడా బిజీ అవుతున్నారు. వీరి బాటలోనే రష్మీ కొనసాగనుందంటున్నారు.












Click it and Unblock the Notifications