ఆ నలుగురు కోసం మాత్రమే ఆ ఒక్క పని చేస్తానంటున్న నేషనల్ క్రష్..!
భారత సినీ పరిశ్రమలో నేషనల్ క్రష్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది "రష్మిక మందన్నా". ప్రస్తుతం దక్షిణ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస చిత్రాలతో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. రష్మిక తన సినీ ప్రయాణాన్ని నాగశౌర్యతో నటించిన 'ఛలో' (2018) సినిమాతో టాలీవుడ్‌లో ప్రారంభించింది. ఆ చిత్రంలోని ఆమె సహజ నటన, గ్లామర్ అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత 'గీత గోవిందం', 'భీష్మ', 'సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా నిలిచింది.
పుష్పతో దేశవ్యాప్తంగా క్రేజ్..
అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప: ది రైజ్' రష్మిక కెరీర్‌లో గేమ్‌చేంజర్ అయ్యింది. "స్రీవల్లి" పాత్రతో ఆమె దేశమంతా అభిమానులను సంపాదించింది. ఈ సినిమా తర్వాత రష్మిక కేవలం టాలీవుడ్ స్టార్ కాదు, పాన్-ఇండియా హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత రష్మిక హిందీ సినిమాల్లో కూడా తన సత్తా చాటింది. రణబీర్ కపూర్‌తో 'యానిమల్', విక్కీ కౌశల్‌తో 'ఛావా' వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అయితే సల్మాన్ ఖాన్‌తో చేసిన 'సికందర్' మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఇక ఇటీవల విడుదలైన ఆమె 'కుబేరా', 'థామా' సినిమాలు** బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. భాషతో సంబంధం లేకుండా నెలకు ఒక కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సుందరి.. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్‌లలో ఒకరుగా మారింది. రష్మిక ప్రస్తుతం 'మైసా' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తోంది. ఇదే కాకుండా పలు భారీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, నవంబర్ 7న విడుదల అయ్యింది. ఈ క్రమంలోనే ఇటీవల జగపతిబాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో పాల్గొన్న రష్మిక పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నెగిటివ్ రోల్ ఇస్తే చేస్తావా?" అని జగపతిబాబు అడగగా.. రష్మిక "తడుముకోకుండా చేస్తాను" అని సమాధానమిచ్చింది. తనకు వెరైటీ రోల్స్ అంటే చాలా ఇష్టమని, కథ ఆసక్తికరంగా ఉంటే నెగెటివ్ క్యారెక్టర్స్ కూడా చేయడానికి సిద్ధమని చెప్పింది.
ఆ నలుగురి కోసమే స్పెషల్ సాంగ్స్..
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేస్తున్న తరుణంలో.. రష్మిక మాత్రం తన మైండ్ లో నలుగురు దర్శకులు ఉన్నారని.. వాళ్లు అడిగితేనే నేను స్పెషల్ సాంగ్స్ చేస్తానని వ్యాఖ్యానించింది. ఆ నలుగురు తప్ప ఎవరికీ 'అవును' చెప్పనని రష్మిక క్లారిటీ ఇచ్చింది. ఆ నలుగురు డైరెక్టర్స్ పేర్లు వెల్లడించకపోయినా వారి ఎవరా అని చర్చ నడుస్తోంది. మరి ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక ఒకో సినిమాకి రూ.5 నుండి రూ.6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోన్న రష్మిక.. స్పెషల్ సాంగ్ చేయాలంటే ఫిల్మ్ మేకర్స్ భారీ మొత్తాలు ఆఫర్ చేయాల్సిందేనని టాక్ వినిపిస్తుంది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications