అవును పిరియడ్స్‌తో బాధపడుతున్న అయితే ఏంటీ..?
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్నా. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

తాజాగా అభిమానులతో ముచ్చటించిన రష్మిక తన వ్యక్తిగత విషయాలను వారితో ముచ్చటించింది. భరించలేని నొప్పి వస్తోంది అయినా ఓర్చుకుంటున్నా ఇది తగ్గాలంటే ఏం చేయాలంటూ అభిమానులకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చింది. 1. ఐస్‌క్రీమ్స్, చాక్లెట్స్ తినాలా? 2. ఎవరినైనా లాగి కొట్టాలా.? 3. మైండ్‌ను డైవర్ట్ చేసేందుకు ఏదైనా సినిమా చూడాలా ? 4. అలాగే ఏడుస్తూ కూర్చోవాలా.? అని అడిగింది.
ఆడవాళ్లు నెలసరి వల్ల వచ్చే బాధను తట్టుకుంటారు. హీరోయిన్స్ విషయంలో అయితే ఇది మరింత ఎక్కువుగా ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక రుతుస్రావంతో ఇబ్బంది పడుతున్నారని అభిమానులకు అర్థం అయింది. నెలసరి కావడంతో రష్మిక పుష్ప-2 షూటింగ్‌కు దూరంగా ఉందని తెలుస్తోంది.రుతుస్రావం గురించి రష్మిక చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications