అల్లు అర్జున్ ప్రేయసిగా, భార్యగా.. ఇప్పుడు విలన్ గా.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ప్రతి హీరోకి జీవితంలో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అలా ప్రభాస్ కు బాహుబలి అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పుష్ప అని చెప్పొచ్చు. ఈ మూవీ పార్ట్-2 రిలీజైన తర్వాత బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకుపైగా కలెక్ట్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్.. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో ఓ మూవీ చేస్తున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ మూవీ సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
పుష్ప 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఆయన ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ మూవీని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ రూ. 800 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణెతోపాటు మరో నలుగురు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్- అట్లీ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్య శ్రీ భోర్సే, అలియా.. తదితర హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ హీరోయిన్స్ అందరూ కీలకపాత్రల్లో మాత్రమే కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై మరికొద్ది రోజుల్లో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది.
ఇక అసలు విషయం ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు మరో కథానాయిక పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు.. మొన్నటి వరకూ సామి.. సామి.. అంటూ బన్ని తో ఆడి పాడిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రష్మిక పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

దీనిపై అధికారికంగా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ప్రేయసిగా, భార్యగా.. ఇప్పుడు విలన్ గా నటిస్తోంది అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల కుబేర చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.












Click it and Unblock the Notifications