సమంతలానే రష్మికకూ మరో 'మయోసైటిస్'?
కన్నడం నుంచి తెలుగులోకి, అక్కడి నుంచి పాన్ ఇండియా హీరోయిన్ అయిన నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. పుష్ప1, పుష్ప2తోపాటు అంతకుముందు విడుదలైన యానిమల్ చిత్రాలు సంచలన విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా తిరుగులేని హీరోయిన్ గా చెలామణి అవుతోంది. తన కెరీర్ లో భాగంగా ఎన్నో మంచి సినిమాలు చేసింది. జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది.. విజయాలు సాధిస్తుంది. ఆకట్టుకునే రూపంతోపాటు చక్కని ఛాయతో మెరిసిపోయే రష్మిక ప్రస్తుతం ఒకరకమైన చర్మవ్యాధితో బాధపడుతోందని తెలుస్తోంది.
చర్మంపై మంట
తన వృత్తిలో భాగంగా ముఖానికి మేకప్ వేసుకునేందుకు అనేక రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ ను వాడాల్సి ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ రసాయనాలు కలిపినవి వాడటంవల్ల ముఖం మొత్తం దుద్దుర్లు రావడం, ఎర్రగా అయిపోవడం, చర్మవ్యాధుల బారిన పడటంలాంటి సమస్యలు తలెత్తుతాయి. చర్మవ్యాధుల స్పెషలిస్టును రష్మిక కలిసినప్పుడు ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. చర్మంపై తరుచుగా మంట రావడంతోపాటు ఎరుపు, దుద్దుర్లు వస్తున్నాయి. ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తోంది.

శరీరం మొత్తం దుద్దుర్లు వచ్చే అవకాశం ఉంది
రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ వాడటంవల్ల ముఖంపైనే కాకుండా శరీరం మొత్తం దుద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అది వారి శరీర తీరునుబట్టి ఆధారపడివుంటుంది. పిగ్మెంటేషన్ కూడా పెరుగుతుంది. జుట్టు రాలడం, చర్మం పొలుసుల్లా మారి ఊడిపోవడం జరుగుతుంటుంది. దీన్ని సోరియాసిస్ అంటారు. అయితే ఏ చర్మవ్యాధి ఉన్నప్పటికీ ఎవరూ దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు కలిసి కాస్మెటిక్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మూడు సినిమాలు చేస్తోంది. షూటింగ్ జరిగే సమయంలో లైట్స్ వేడికి ముఖానికి వేసుకున్న కాస్మెటిక్స్ నెమ్మది నెమ్మదిగా కరుగుతుంటాయి. దీనివల్ల దురద వస్తుంది. గ్యాప్ రాగానే మళ్లీ మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ సినీ ఆర్టిస్టుల జీవితాల్లో తెరవెనక ఉండే కష్టాలు. తెరపై మనల్ని ఆనందింపచేయడానికి తెరవెనక వారు అటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటారాు.












Click it and Unblock the Notifications