థియేటర్లలో ప్లాఫ్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్..!
ఇటీవలి కాలంలో చాలా పెద్ద సినిమాలు హిట్ కంటే ప్లాఫ్ ఎక్కువగా అవుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజై ప్రేక్షకుల్ని మెప్పించలేక బోల్తా కొడుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మహారాజ రవితేజ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంచనాలను అందుకోలేక పోయింది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వర ప్రసాద్, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, వీటికంటే ముందు జనవరి 9 న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ చిత్రాలు విడుదల అయ్యాయి.
అయితే ఇన్ని సినిమాల మధ్య రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కూడా రిలీజ్ కు సిద్ధమైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో ప్లాఫ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఓటీటీ రిలీజ్ లోనూ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిందీ మూవీ. మార్చి 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవితేజ సరసన హీరోయిన్లుగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటించారు.
ఇక రవితేజ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటీటీలో నంబర్ వన్ ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.. థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది. భార్యకు తెలియకుండా ఎఫైర్ నడిపిన భర్తగా రవితేజ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. థియేటర్లలో ఈ మూవీని పట్టించుకోని ప్రేక్షకులు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం ఎగబడి చూసేస్తున్నారు.

కథ విషయానికి వస్తే.. తనకు పెళ్లయిన విషయాన్ని మానస దగ్గర, ఎఫైర్ గురించి భార్య బాలామణి దగ్గర రామ్(రవితేజ) దాచేస్తాడు. ఆ తర్వాత ఏమైంది..? భార్యకు, ప్రియురాలికి నిజం తెలియకుండా రామ్ ఎలాంటి తంటాలు పడ్డాడు..? పరాయి స్త్రీతో తన భర్త శారీరక సంబంధం పెట్టుకున్నట్లు తెలిసిన బాలామణి ఏం చేసింది..? చివరికి ఏమైంది..? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే..












Click it and Unblock the Notifications