ప్రభాస్ తిరస్కరించిన బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుసా?
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రం విజయానందంలో ఉన్నారు. ఈ సినిమా మొదటి రెండురోజులకే రూ.300 కోట్లు వసూలు చేసింది. తర్వాత్తర్వాత ఈ సినిమా రూ.వెయ్యి కోట్లు వసూలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాలను అధిగమిస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. కల్కి తర్వాత రాజాసాబ్, స్పిరిట్, సలార్2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇది కాకుండా సుకుమార్ తో ఓ చిత్రం ఒప్పుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
హీరోలన్న తర్వాత కొన్నిసార్లు కథలు నచ్చక కొన్ని సినిమాలను వదిలేస్తున్నారు. అలాగే మన డార్లింగ్ కూడా తన కెరీర్ మొదటి నుంచి కొన్ని సినిమాలను తిరస్కరించాడు. అయితే వాటితో చేసిన హీరోలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ప్రభాస్ ఫెయిల్యూర్ సినిమాలను చేశాడు. అన్నీ కథ నచ్చక, కాల్షీట్లు ఖాళీలేక, కొన్ని ఇతర కారణాలతో వీటిని చేయలేదు. వాటి వివరాలు తెలుసుకుందాం.

సింహాద్రి కథను వినిపించిన రాజమౌళి
సింహాద్రి కథను రాజమౌళి ముందు ప్రభాస్ కే చెప్పాడు. అయితే దాన్ని చేయకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ తో తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అలాగే నాయక్ సినిమాను వినాయక్ ముందుగా డార్లింగ్ కే చెప్పాడు. తర్వాత రామ్ చరణ్ దగ్గరకు వెళ్లగా అది పెద్ద హిట్ అవడంతోపాటు చెర్రీకి మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. బృందావనం సినిమా కూడా వంశీ పైడిపల్లి ముందుగా ప్రభాస్ కే వినిపించారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. ఫ్లాప్స్ లో ఉన్న తారక్ కు మంచి హిట్ ను అందించింది ఈ సినిమా.
ఒక్కడు సినిమా ముందుగా డార్లింగ్ వద్దకే
దిల్ సినిమా కూడా ముందుగా ప్రభాస్ దగ్గరకి వచ్చింది. తర్వాతే వినాయక్ నితిన్ తో చేసి భారీ హిట్ కొట్టారు. సుకుమార్ మొదటి చిత్రం ఆర్య కూడా కథ డార్లింగ్ దగ్గరికే వచ్చింది. తర్వాత అల్లు అర్జున్ చేసి ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. సురేందర్ రెడ్డి రవితేజతో చేసిన కిక్ కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది. దీన్ని రవితేజ చేసి భారీ హిట్ అందుకున్నాడు. మహేష్ బాబు-భూమిక చేసిన ఒక్కడు సినిమా స్క్రిప్ట్ నచ్చక ప్రభాస్ చేయనన్నాడు. తర్వాత మహేష్ బాబు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యారు. ఊసరవెల్లి, జిల్, డాన్ శీను చిత్రాలు కూడా ముందుగా ప్రభాస్ వద్దకే వెళ్లాయి.












Click it and Unblock the Notifications