The RajaSaab Trailer: ఫుల్ మీల్స్ అడిగితే బిర్యానీ పెట్టాడు భయ్యా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న మూవీ 'ది రాజాసాబ్' నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు రిలీజైంది. ట్రైలర్ మొత్తం ఎంతో ఆసక్తిగా కట్ చేశారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుంది. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమైనా చిమనా.. రాక్షసుడ్ని అని డార్లింగ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయర్ రో ల్ లో కనిపిస్తున్నారు.
ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు. వైబ్, విజువల్స్ లో వింటేజ్ డార్లింగ్ కనిపిస్తున్నారు. హారర్ కు హాస్యాన్ని జోడించడంలో డైరెక్టర్ మారుతి మరోసారి సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ మూవీని సంక్రాంతికి కానుకగా జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కానుంది.

గతంలో రిలీజైన ది రాజాసాబ్ టీజర్ సైతం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్ లో వావ్ అనిపించారు. టీజర్ లో మాళవిక మోహనన్, ప్రభాస్ మధ్య డైలాగ్స్ తో పాటు డార్లింగ్ వింటేజ్ లుక్స్ ఆకట్టుకున్నాయి. సినిమాలోను ఆ ఫార్ములాను పకడ్బందీగా అనుసరించారు.
ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.












Click it and Unblock the Notifications