Prabhas: రాజు గారే నెం. 1
సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ మధ్య అనేక సినిమాల్లో గెస్ట్ రోల్స్ కు ప్రాధాన్యత పెరిగింది. విక్రమ్ మూవీ చివరి 10 నిమిషాలు సూర్య గెస్ట్ రోల్ సినిమాపై ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అటు క్రేజీ ప్రాజెక్ట్స్ తోపాటు ఇతర సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి అలరిస్తున్నారు. సినిమా విజయంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవల కన్నప్ప మూవీలో రుద్ర పాత్రలో మెప్పించారు ప్రభాస్. ప్రభాస్ గెస్ట్ రోల్ తో కన్నప్ప సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ కోసం రెబల్ ఫ్యాన్స్ క్యూ కట్టారు. రెబల్ స్టార్ కనిపించినంత సేపు ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ లభించింది. ప్రభాస్ కారణంగా కన్నప్ప కు ఫస్ట్ డే భారీ వసూళ్లు వచ్చాయి. ఇక తాజాగా మరో పాన్ ఇండియా మూవీ మిరాయ్ లోనూ తన వాయిస్ వినిపించి సినిమాపై అంచనాలను పెంచేశారు. యంగ్ యాక్టర్ తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన మిరాయ్ లో ప్రభాస్ వాయిస్ ఇచ్చారు. సినిమా ప్రారంభంలో కొద్దిసేపు ప్రభాస్ వాయిస్ తో కథ నడుస్తుంది. ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మూవీపై బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

దీంతో రెబల్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కనిపించి కన్నప్పను కరుణించాడు.. వినిపించి మిరాయ్ ను నిలబెట్టాడు.. రాజంటే రెబలేరా.. రెబల్ అంటే రాజేరా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం .. మనిషే కాదు ఆ పేరు కూడా డ్యూటీ చేస్తది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ తదుపరి చిత్రం రాజాసాబ్ జనవరి 9 న విడుదల కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications