ఎల్లప్పుడూ నీకోసం నేనుంటా: రేణు దేశాయ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు కూడా దూరం జరిగింది. రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావుతో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. పవన్ కల్యాణ్ తో విడిపోయినప్పటికీ తన పిల్లలైన అకిరా నందన్, ఆద్య బాగోగులు చూసుకోవడమే కాకుండా వారు తండ్రి దగ్గరకు కూడా తరుచుగా వెళుతుంటారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కల్యాణ్ తనతోపాటు అకినా నందన్ ను వెంటబెట్టుకొని తిరిగిన సంగతి తెలిసిందే. తాను కలిసి వీఐపీలందరికీ అకిరాను పరిచయం చేశారు.
సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. సామాజిక సమస్యలపై స్పందిస్తుంటుంది. మూగ జీవాలకు సంబంధించి తాను చేసిన పనులపై పోస్ట్ చేస్తుంటుంది. వాటికి సాయం చేస్తూ జంతు ప్రేమికురాలు అని పేరు తెచ్చుకుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. 'నేను ఎప్పటికీ నీతోనే ఉంటా.. అద్భుతమైన పీపుల్స్'అని రాసుకొచ్చింది. ఓ యానిమల్ లవర్ రేణుదేశాయ్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ పోస్టు పెట్టింది. దానికి ఆమెను ట్యాగ్ చేస్తూ రేణుపై కామెంట్స్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ పోస్టు వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఎల్లప్పుడూ నీకోసం నేనుంటాను అంటే పవన్ కల్యాణ్ కోసం ఎంతకాలమైనా తాను ఎదురుచూస్తుంటాను అనే అర్థం వస్తుందని, ఆ అర్థంలోనే ఈ పోస్టు పెట్టిందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. వీరిద్దరూ మంచి జంట అని, విడిపోకుండా ఉంటే బాగుండేదని, ఎందుకు విడిపోయారో వీరిద్దరికే తెలియాలని, పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునే పవన్ కల్యాణ్ రేణు దేశాయ్ తో కూడా అలాగే ఉంటే బాగుండేదని, ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారని, వారి కాపురం కూడా అందరికీ ఆదర్శంగా నిలిస్తే బాగుండేదని మరొక నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఆరు శాఖలను పర్యవేక్షిస్తున్నారు. వీటిల్లో అటవీ, పర్యావరణ, పంచాయితీరాజ్ శాఖలపై బాగా దృష్టిపెట్టారు.












Click it and Unblock the Notifications