అతనికి ప్రేమ లేదు..పవన్‌కు రేణు దేశాయ్ కౌంటర్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో కంటే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించింది. పుణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా రేణు దేశాయ్‌ విడుదల చేసింది. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు సైతం పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ వారికి గట్టిగానే కౌంటరిచ్చింది.

renu desai slams on pawan kalyan fans

మీ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ.. నేను చేసుకుంటే తప్పా అంటూ అభిమానులను ప్రశ్నించింది.పవన్‌ను ఉద్దేశించి పరొక్షంగా ఆయన ఒక అమ్మాయితో బేబీని కన్నారు. ఈ మాటలు నేను చెప్పడానికి చాలా ఈజీగా అనిపించినప్పటికీ.. నిజ జీవితంలో ఇది చాలా కష్టంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ని పిచ్చిగా ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ మీరు ఒక్కసారి ఆలోచించండి.మీ భర్తగా ఆయన ఉండి ..ఇలా మీతో చేస్తే మీకు ఏమనిస్తుందని రేణు దేశాయ్‌ అభిమానులను ప్రశ్నించారు. 11 ఏళ్ల కాపురం తరువాత వేరే మహిళతో ఓ బిడ్డను కంటే మీకు ఓకేనా .

అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందని పవన్ కల్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ కౌంటరిచ్చింది. ఆమె తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ అభిమానులపై ఫైర్ అయ్యారు. గత కొద్ది రోజుల నుంచి రేణు దేశాయ్ యానిమల్స్‌కు, చిన్నారులకు సహాయం చేస్తుంది. ఈ క్రమంలో డబ్బులు సరిపోకపోవడంతో ఫాలోవర్స్‌ను అడుగుతుంది. అయితే ఎవరో హెల్ప్ చేశారని తెలుపుతూ.. రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది.

దీంతో ఓ నెటిజన్ వాళ్లు కూడా మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను.. నేను పని చేసిన దానికి వెంటనే నాకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ అని అందరూ గుర్తుంచుకోవాలని ఆమె అభ్యర్థించింది. మీలో కొంతమంది నేను చేసే ప్రతి పోస్ట్‌ను వందల కొద్ది నా మాజీ భర్తతో ఎందుకు పోల్చాలి? నేను ఇప్పటికీ వందల కొద్ది అకౌంట్స్‌ను డిలీట్ చేసి బ్లాక్ చేసి ఉంటాను.

నేను 10 సంవత్సరాలుగా జంతువులకు సహాయం చేస్తున్నాను. దీనికి నా మాజీ భర్తతో ఎటువంటి సంబంధం లేదని రేణు దేశాయ్ తెలిపింది. ఎందుకంటే అతను నేను చేసే జంతువులను పట్టించుకోడు లేదా ప్రేమించడు అంటూ పవన్‌కు సైతం కౌంటరిచ్చింది ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+