ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ బ్రహ్మానందం ఆస్తుల విలువ

భారతదేశం మొత్తంమీద స్టార్ హీరోలతో సమానంగా లేదంటే వారికన్నా ఎక్కువగా ఆస్తులను కలిగివుండటంతోపాటు వారికంటే అధికంగా పారితోషికం తీసుకునే హాస్యనటుడు ఎవరంటే.. కేవలం బ్రహ్మానందం అని చెప్పొచ్చు. దేశంలో అత్యంత ఖరీదైన కమెడియన్ గా ఆయన పేరు సంపాదించుకున్నారు. అందుకు కారణం తాను సంపాదించిన ప్రతి రూపాయిని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టడంతోపాటు ఎటువంటి దురలవాట్లు లేకపోవడంతో ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకొని తన ఆస్తులను భారీగా పెంచుకున్నారు.

రోజుకు రూ.లక్ష తీసుకునే బ్రహ్మానందం ఒక్కోసారి కాల్షీట్లను బట్టి సినిమాకు కోటిరూపాయల పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పరిశ్రమకు వచ్చిన కొత్తలో జంధ్యాలతోపాటు రామానాయుడు, చిరంజీవి బాగా ప్రోత్సహించడంతో స్టార్ హీరోలతో సమానంగా ఎదిగారు. సినిమాలో బ్రహ్మానందం కనపడ్డాడంటే ప్రేక్షకుల నుంచి కచ్చితంగా ఈలలు వస్తాయి. కొద్దిసేపు ఆ సౌండ్ తో థియేటర్ దద్దరిల్లిపోతుంది. అంతటి ఇమేజ్ ను సొంతం చేసుకున్న బ్రహ్మీ హవా ప్రస్తుతం తగ్గింది. తగ్గింది అనేకన్నా ఆయనే తగ్గించుకున్నారు అని చెప్పొచ్చు. ఆచితూచి మాత్రమే సినిమాలు చేస్తున్నారు.

richest comedian brahmanandam property value

ఎన్నో చిత్రాలను తన కామెడీతో సూపర్ హిట్లుగా మార్చారు. ప్రజలను కడుపుబ్బా నవ్వించారు. సోషల్ మీడియాలో మీమ్స్ అన్నింటికీ ప్రాణం పోసే వ్యక్తి కూడా ఆయనే. తనదగ్గర ఆడి R8, ఆడి Q7, బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ వంటి కార్లతోపాటు అనేక కంపెనీల కార్లున్నాయి. ప్రతి రూపాయిని పొదుపు చేసుకుంటూ రావడంవల్ల ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.750 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఎంతోమంది స్టార్ హీరోలకు కూడా అంత ఆస్తులు లేవని చెప్పొచ్చు. గతేడాది కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగమార్తాండలో నటించారు. ఆయనలోని మరో నటనా కోణం ఆవిష్కృతమైంది. హాస్యమే కాకుండా ఎటువంటి పాత్రనైనా తాను అవలీలగా చేయగలను అని బ్రహ్మానందం నిరూపించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+