'వార్2'కు రూ.700 కోట్లు... 'కూలీ'కి రూ.600 కోట్లు!

ఏడాది క్రితం నుంచి సినీ ప్రియులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన సినిమాలు విడుదల కానే అయ్యాయి. ఈ రెండు సినిమాల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని, రెండు సినిమాలు నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంటాయని దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఆశించారు. చివరకు వారి ఆశ నిరాశ అయింది. రెండు సినిమాలు యావరేజ్ అని చెప్పాలా? ఫ్లాప్ అయ్యాయని చెప్పాలా? అనేది సినీ విశ్లేషకులకు కూడా అర్థం కాకుండా ఉంది. దక్షిణాదిలో కూలీపై అంచనాలు భారీగా ఉంటే, ఉత్తరాదిలో వార్2పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలన్నీ తుస్ అన్నాయి
వరుసగా సెలవులు కావడంతో వాటిని ఉపయోగించుకుందామని బరిలోకి దిగాయి. సోమవారం నుంచి ఈ రెండు సినిమాలకు కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం కనపడుతోంది. వార్2, కూలీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. వార్2 రూ.700 కోట్ల గ్రాస్, కూలీ రూ.600 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలి. అంత వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతాయి. పెట్టిన రూపాయి పెట్టినంతవరకు మాత్రమే వస్తుంది. లాభాల సంగతి దేవుడెరుగు. అయితే అంత గ్రాస్ వస్తుందా? అంటే అనుమానమే అంటున్నారున ట్రేడ్ పండితులు. వార్2లో వీఎఫ్ఎక్స్ అంత చెత్తగా ఉంటాయని సినీ ప్రియులెవరూ అనుకోలేదు. ఎందుకంటే యష్ రాజ్ ఫిలింస్ లాంటి బ్యానరు నుంచి రూ.400 కోట్ల బడ్జెట్ తో సినిమా వస్తోందంటే అదిరిపోయే స్థాయిలో ఉంటుందనే అంచనాలుండేవి. చివరకు అవన్నీ తప్పని నిరూపితమయ్యాయి.

Rs 700 crore for War 2 Rs 600 crore for Coolie these are the break even target

గుణపాఠం నేర్చుకున్న తారక్
దక్షిణాదిలో.. ముఖ్యంగా తమిళనాడు, ఏపీలో కూలీ అంటే ఒక పూనకం వచ్చినట్లుగా అభిమానులు ఊగిపోయారు. సినిమా చూసి థియేటర్ నుంచి మాత్రం చాలా నీరసంగా బయటకు వచ్చారు. చివరి గంట సినిమాకు మైనస్ అయింది. ఏ డైరెక్టర్ అయినా ముందు ఎలా తీసినా కనీసం సినిమా చివరలో, థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వెళ్లే సమయంలో తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి అద్భుతంగా తీయాలని చూస్తాడు.

ఆ విషయంలో లోకేష్ కనగరాజ్ కు చాలా తక్కువ మార్కులే పడతాయి. ఇదే పెద్ద మైనస్ అయింది. రెండు పాత్రలు మాత్రమే ఆకట్టుకున్నాయి. సౌబిన్ షాహిర్, రచిత రామ్ పాత్రలు మాత్రమే ఆకట్టుకున్నాయి. వార్2 కోసం బాలీవుడ్ లో తారక్ ఒక ట్రయల్ వేశారు. అది ఫెయిలైంది. తన సినిమాలనే నేరుగా బాలీవుడ్ కు తీసుకువెళ్లాలి కానీ తాను వెళ్లకూడదు అనే పాఠాన్ని ఈ చిత్రంద్వారా తారక్ నేర్చుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+