వామ్మో.. ఆ స్టార్ బ్యూటీ రెమ్యూనరేషన్ అంత భారీగా పెంచేసిందా..?
"రుక్మిణీ వసంత్".. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. 2019లో 'బీర్బల్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 2023లో వచ్చిన 'సప్త సాగరాలు దాటి' చిత్రంతో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో సహజమైన నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నటించినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అలానే "బఘీరా", "బైరతి రంగల్", "ఏస్" చిత్రాల్లో నటించినప్పటికీ.. అవి పెద్దగా విజయం పొందలేకపోయాయి. రీసెంట్ గానే శివ కార్తికేయన్‌తో నటించిన "మదరాసి", రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "కాంతారా: చాప్టర్ 1" సినిమాలో నటించి మెప్పించింది. భారీ హిట్ కొట్టిన ఈ మూవీలో అమ్మడు నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఫీదా అవుతున్నారు. స్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.

అయితే కాంతారా సినిమా తర్వాత ఆమె రెమ్యూనరేషన్ పెంచింది అంటూ వార్తలు వినిపించాయి.. ఇప్పుడు మరోసారి ఈ వార్తలు వినిపించడంతో ఇందులో నిజం ఉందని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాకి ఒక్కో సినిమాకి ఐదు కోట్లకు పైగా తీసుకుంటుందని సమాచారం. ఈ లెక్కన చూస్తే ఈమె ఒక హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. మేకర్స్ కూడా ఆమె క్రేజ్, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అడిగినంత పారితోషికాన్ని ఆమోదించారట.
ఇక ప్రస్తుతం రుక్మిణీ స్టార్ హీరో యష్ సరసన పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' లో నటిస్తుంది. దీంతో పాటుగా తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ మూవీలో కూడా నటిస్తుంది. ఇందులో టాక్సిక్ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. వీటితో పాటుగా మరో నాలుగు భారీ ప్రాజెక్టుల కు ఆమె సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ భామ తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తుందో అని.












Click it and Unblock the Notifications