పవన్ కల్యాణ్‌తో మెహర్ రమేశ్ సినిమా ..రూ.1000 కోట్లు పక్కా
దర్శకుడు మెహర్ రమేశ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటుడుగా కెరీర్ మొదలు పెట్టిన మెహర్ రమేశ్, ఆ తర్వాత అస్టిసెంట్ డైరెక్టర్‌గా మారారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మెహర్ రమేశ్‌కు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు. తమిళంలో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయిన బిల్లా సినిమాను తెలుగులో దర్శకత్వం వహించారు మెహర్ రమేశ్. తమిళంలో ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించగా, తెలుగులో ప్రభాస్ నటించారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. కానీ మెహర్ రమేశ్ టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి.
ప్రభాస్‌ను స్టైలిష్‌గా చూపించడంలో మెహర్ రమేశ్ సక్సెస్ అయ్యారు. దీంతో ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్‌తో కంత్రి సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయినప్పటికీ మెహర్ రమేశ్‌పై నమ్మకంతో ఎన్టీఆర్ ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా శక్తి. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచింది. ఎన్టీఆర్ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. మెహర్ రమేశ్ దెబ్బకు నిర్మాత అశ్వినీదత్ కొన్నేళ్ల పాటు సినిమాల జోలికి పోలేదు.

వెంకటేష్‌తో షాడో, చిరంజీవితో భోళా శంకర్ వంటి సినిమాలకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా భోళా శంకర్ సినిమాతో అయితే మెహర్ రమేశ్ భారీ ట్రోలింగ్ గురయ్యాడు. దీంతో అతనితో ఏ హీరో కూడా సినిమాలు తీయాలనే సాహసం చేయడం లేదు. అయితే తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో మెహర్ రమేశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన తర్వాత సినిమా పవన్ కల్యాణ్‌తోనే ఉంటుందని ప్రకటించారు.
దీనిలో భాగంగానే పవన్ కల్యాణ్‌తో మెహర్ రమేశ్ సినిమా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది.అయితే దీనిపై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మెహర్ రమేశ్‌తో సినిమా చేస్తే మా హీరో ఫ్యూచర్ ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ..పవన్‌తో మెహర్ రమేశ్ చేస్తే అది రూ.1000 కోట్ల సినిమా అవుతుందంటూ సెటైర్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications