ముదిరిన అల్లు వర్సెస్ మెగా వార్.. అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేయని మెగా హీరో !

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న మెగా - అల్లు కుటుంబాలు.. ఇప్పుడు మాత్రం దూరంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. వేడుకలు అయినా, సినిమా ఈవెంట్ లు అయినా రెండు ఫ్యామిలీలు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ గత తొమ్మిదేళ్లుగా మాత్రం వరుస ఘటనల నేపధ్యంలో పరస్పరం దూరమవుతూ వస్తున్నాయి అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

"చెప్పను బ్రదర్" తో మొదలైన చిచ్చు..

అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా సక్సెస్ ఈవెంట్‌లో.. అభిమానులు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించాలని కోరారు. కానీ ఆ రోజు అల్లు అర్జున్ మాత్రం నేరుగా "చెప్పను బ్రదర్" అని స్పందించారు. ఆ వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అదే సమయంలో అల్లు ఫ్యామిలీ-మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య "ఫ్యాన్ వార్స్" కి నాంది పలికింది.

sai-dharam-tej-not-dancing-for-pushpa-song-and-video-got-viral

ఆ తర్వాత మరో ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్, మెగాస్టార్ పేర్లు ఘనంగా ప్రస్తావించాడు. ఆ తర్వాత ఈ వివాదం కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మళ్లీ ఫ్యామిలీల ఇష్యూ వేడెక్కింది.

నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా బన్నీ వెళ్లడం మెగా ఫ్యాన్స్‌ను అసహనానికి గురి చేసింది. నాగబాబు సైతం సోషల్ మీడియాలో "ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు పరాయి వాడే" అంటూ పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యానించారు. సాయి ధరమ్ తేజ్ నేరుగా అల్లు అర్జున్‌ను ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేశారు. ఎన్నికల అనంతరం కూడా సైలెంట్ వార్ నడిచింది.

అలానే ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ అడవుల గురించి, సినిమా హీరోల క్యారెక్టర్ గురించి వ్యాఖ్యానించడం.. బన్నీ ఫ్యాన్స్‌కు కౌంటర్‌లా అనిపించింది. ఆ తర్వాత మారుతీ నాగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ "మన ఫ్రెండ్ అనుకో, కావాల్సిన వాళ్లనుకో, నాకిష్టమైతే నేనొస్తా" అంటూ తనకు ఇష్టం ఉన్నప్పుడే ఈవెంట్లకు హాజరవుతానని చెప్పడం మెగా ఫ్యాన్స్‌కి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు అని టాక్ నడిచింది.

అంతే కాకుండా ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎలాంటి శుభాకాంక్షలు పోస్ట్ చేయకపోవడం కూడా ఫ్యాన్స్ మధ్య కొత్త రగడకు దారి తీసింది. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు అంటూ ఫ్యాన్స్ వార్ నడుస్తోంది. ఇక ఇప్పుడు ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసేలా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రవర్తించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

"పుష్ప" సాంగ్ వివాదం..

అల్లు అర్జున్ "పుష్ప" సినిమా జాతీయ స్థాయిలో హవా సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డులు తిరగరాసింది. కాగా ఓ ఈవెంట్ లో పుష్ప సాంగ్ వస్తే.. దేవిశ్రీప్రసాద్, ఇతరులు అందరూ ఆ పాటకు స్టెప్పులు వేశారు. అక్కడే ఉన్న సాయి ధరమ్ తేజ్ మాత్రం... ఆ పాటకు డ్యాన్స్ వేయకుండా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+