మీడియా వల్లే నాకు అలా జరిగింది - సాయి ధరమ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుప్రీం హీరో "సాయి ధరమ్ తేజ్ ". 2014లో 'పిల్లా నువ్వు లేని జీవితం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే హిట్ సాధించి.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి విజయాలతో యూత్ హీరోగా గుర్తింపు పొందారు.
ఆ తర్వాత 'విన్నర్', 'జవాన్', 'ఇంటిలిజెంట్' వంటి వరుస ఫ్లాప్‌లు ఆయన కెరీర్‌ను కాస్త వెనక్కి నెట్టాయి. అయితే 'చిత్రలహరి', 'ప్రతి రోజు పండగే', 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. 2021లో వచ్చిన 'రిపబ్లిక్' ఆయనకు క్రిటికల్ అప్రిషియేషన్ తెచ్చిపెట్టగా.. పవన్ తో కలిసి నటించిన "బ్రో" మంచి సక్సెస్ కొట్టింది.

ప్రస్తుతం 'సంబారాల యేటిగట్టు' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో రాబోతున్నారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన 'అభయమ్ మసూమ్ సమ్మిట్' లో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లలపై లైంగిక దాడులను అరికట్టడం, అవగాహన కల్పించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ - యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 70 నగరాల నుంచి వేలాది మంది యువ ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. పిల్లలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. సోషల్ మీడియాలో పిల్లలపై అబ్యూజ్ చేస్తూ, దీనిపై లైక్స్ వేస్తూ, నవ్వే సమాజం మనం కోరుకోవాలా? స్వేచ్ఛ ఉన్నా.. అది ఎదుటివారికి నొప్పి కలిగించే స్థాయిలో ఉండకూడదు అని వ్యాఖ్యానించారు. తన సామాజిక కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ.. "2015లో అరకు ప్రాంతంలో పిల్లల విద్య కోసం స్కూల్ నిర్మించాను. కొంతమంది పిల్లలను దత్తత తీసుకొని వారి చదువు, పోషణ చూసుకుంటున్నాను. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తప్పనిసరిగా చెప్పాలి. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడపాలి. వారంలో కనీసం ఒక రోజు అయినా కుటుంబంతో కలిసి కూర్చోవాలి" అని సూచించారు.
అలాగే సోషల్ మీడియా అకౌంట్ విషయంలో.. పిల్లల అకౌంట్స్ తప్పని సరిగా తల్లిదండ్రుల నంబర్లు లేదా ఆధార్‌తో లింక్ చేయాలి. నా సినిమాల్లో కూడా టీజింగ్ సాంగ్స్‌కి దూరమయ్యాను. ప్రేమిస్తే పొగడాలి కానీ టీజ్ చేయకూడదు. సోషల్ మీడియాలో కాకుండా రియల్ వరల్డ్‌లో బతకడం నేర్పించాలని స్పష్టం చేశారు.
.@IamSaiDharamTej Babu
— Praveen (@AlwaysPraveen7) September 13, 2025
Requested @greatandhranews & Other Few Websites to Don't Post
" FAKE NEWS " .#SaiDharamTej pic.twitter.com/4nrqv6qRZq
ఇక చివరగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. "నా పెళ్లి గురించి ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. కానీ పెళ్లి చేసుకునే సమయం వస్తే నేను ప్రకటిస్తానని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అప్పటి వరకూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని రిక్వెస్ట్ చేశారు. మీడియా కారణంగానే రెండేళ్ల క్రితం తనకు బ్రేకప్ అయిందని చెప్పారు. 2023లో తనకు బ్యాడ్ బ్రేకప్ అయిందని.. మీడియా వాళ్లు తనపై ప్రేమతో ఈ అమ్మాయితో పెళ్లి, ఆ అమ్మాయితో పెళ్లి.. ఆ సినిమా హిట్టైంది కాబట్టి వెంటనే పెళ్లి అంటూ గ్యాప్ ఇవ్వకుండా, నన్ను ఊపిరి పీల్చుకోనివ్వకుండా చాలా వార్తలు రాసేశారు. అందువల్లే తనకు బ్రేకప్ అయిందని.. ఆ అమ్మాయి కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు. దయచేసి మీడియా సైలెంట్ గా ఉంటే తన మ్యారేజ్ గురించి తానే చేస్తానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications