పబ్‌లో సాయిపల్లవి చిందులు..ఆ హీరో కొడుకుతో
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మొదటి సినిమా నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.
ఇక సాయి పల్లవి డ్యాన్స్‌కు అయితే ప్రత్యేక అభిమాన గణమే ఉందని చెప్పాలి. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

ఇక హద్దులు దాటే గ్లామర్ షోకు సైతం సాయి పల్లవి దూరంగా ఉంటుంది. ఇదే సాయి పల్లవిని ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టంది. ఈ ఏడాది సాయి పల్లవి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్‌లో శరవేగంగా జరుగుతుంది.
తాజాగా జపాన్‌లో షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ అక్కడ చిన్నపాటి పార్టీ చేసుకుంది. చిత్ర యూనిట్‌తో కలిసి సాయి పల్లవి చిందులు వేసిన వీడియో బయటకు వచ్చింది. ఓ పబ్‌లో ఈ సెలబ్రేషన్స్ జరిగినట్టు అర్థం అవుతుంది. ఈ వీడియోలో సాయి పల్లవి మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. టీం అందరిలోనూ ఒకే అమ్మాయి అయినప్పటికీ ఏమాత్రం బెదురు లేకుండా ఊరమాస్ డ్యాన్స్‌తో అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications