ఇన్నాళ్లు సహించాను..ఇక నావల్ల కాదు..బాంబు పేల్చిన సాయి పల్లవి
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా 'ఫిదా' నుంచి మొన్న వచ్చిన 'విరాటపర్వం' వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

తాజాగా సాయి పల్లవికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. 'గార్గి' సినిమాలో సాయి పల్లవి నటనగానూ ఈ అవార్డు ఆమెకు దక్కింది. ఇదిలా ఉంటే సాయి పల్లవి సాధారణంగా వివదాలకు దూరంగా ఉంటారు. సాయి పల్లవి ఎప్పుడు సైలెంట్‌గా కనిపిస్తోంది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. అలాంటి సాయి పల్లవి తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ 'రామాయణ'సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.
సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. అయితే ఓ ప్రముఖ తమిళ మీడియా సంస్థ సాయి పల్లవి గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. తాజాగా దీనిపై సాయి పల్లవి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.ఇకపై ఇలాంటి చెత్త కథనాలను మోసుకెళ్లడానికి నేను సిద్ధంగా లేనంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications