సాయిపల్లవికి తీవ్ర అస్వస్థత.. షాక్ లో టాలీవుడ్..!
డాన్సింగ్ క్వీన్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రొమోషన్లతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అయితే ప్రొమోషన్లలో చైతూ, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్ మాత్రమే పాల్గొంటున్నారు. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు.ఆ వేడుకలోనూ సాయి పల్లవి పాల్గొనలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు.
అయితే తాజాగా దీనిపై ఆ చిత్ర దర్శకుడు చందూ మొండేటి స్పందించారు. సాయి పల్లవి ఆరోగ్యం బాలేదు. ఆమె అనారోగ్యానికి గురయ్యారని ఆమె తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతోంది. మరికొన్నిరోజులు ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. అందుకే ఆమె ట్రైలర్ వేడుకలో పాల్గొనలేదు. త్వరలో ఆమె మళ్లీ ప్రొమోషన్స్ లో పాల్గొంటారు" అని డైరెక్టర్ చందూ మొండేటి తెలిపారు.

సాయిపల్లవి బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణ్' చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో రాముడిగా రణ్ బీర్ కపుర్ నటిస్తున్నారు.
ఇక తండేల్ మూవీ శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందినట్లు తెలుస్తోంది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన స్టోరీ లైన్ పై ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ సీక్వెన్స్ కు ఏకంగా 18కోట్లు ఖర్చు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.












Click it and Unblock the Notifications