12 ఎకరాలు కబ్జా చేసిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన తల్లి పేరు కలిసివచ్చేలా సాయి దుర్గాతేజ్ అని పెట్టుకున్నారు. సినిమాలు చేయడంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోను చురుగ్గా పాల్గొంటుంటారు. ఇటీవలే ఏపీ, తెలంగాణను వరదలు ముంచెత్తడంతో రెండు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందజేశాడు. గత చిత్రం విరూపాక్ష రికార్డుస్థాయిలో రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించి సాయిదుర్గాతేజ్ మార్కెట్ స్టామినాను పెంచింది. దీంతో తర్వాత చేయాల్సిన సినిమాలపై బాధ్యత మరింత పెరిగింది. దీంతో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.

మధ్యలోనే ఆగిపోయిన గాంజా శంకర్
వాస్తవానికి సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమా చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో అది మధ్యలోనే ఆగిపోయింది. కొంత సమయం తీసుకున్న తర్వాత కేపీ రోహిత్ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించాడు. దీన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తొలిషెడ్యూల్ కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం 12 ఎకరాల్లో ప్రత్యేకంగా సెట్ వేశారు. కీలకమైన యాక్షన్ ఘట్టాలను ఇందులోనే చిత్రీకరించనున్నారు. అంతేకాకుండా సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు కూడా ఈ సెట్ లోనే జరగబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Saidharam Tej movie shooting in a set built in 12 acres at a huge cost

12 ఎకరాల్లో సెట్
వాస్తవానికి 12 ఎకరాల్లో సినిమా షూటింగ్ కోసం సెట్ వేయడం అంటే అంత ఆషామాషీ అయిన విషయం కాదు. అగ్ర దర్శకులైన రాజమౌళి, శంకర్ సినిమాలకు కూడా ఆ స్థాయిలో సెట్ వేయలేదని తెలుగు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. 12 ఎకరాల్లో సెట్ వేయడం అంటే ఆషామాషీ అయిన విషయం కాదు. కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. సాయిధరమ్ తేజ్ సినిమా కెరీర్ లో ఇంతవరకు ఈ స్థాయిలో భారీ సెట్ నిర్మించలేదు. ఇది ప్రత్యేకంగా నిలిచిపోనుంది. కథ డిమాండ్ చేస్తోంది కాబట్టి అంతమేరకు సెట్ నిర్మిస్తున్నారా? లేదంటే మరేదైనా కారణముందా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మెగా మేనల్లు 12 ఎకరాలను కబ్జా చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+