Viral Video: సాయి పల్లవిని ఇలా తగులుకున్నారేంటి..!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేటితరం టాలెంటెడ్ నటీమణుల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటారు. 2015 ప్రేమమ్ సినిమాతో అందరినీ మాయ చేశారు సాయి పల్లవి. ఈ మూవీలో ఆమె సహజమైన నటనతో మెప్పించారు. ఆ తర్వాత తెలుగులో ఫిదా మూవీతో ప్రేక్షకుల్ని నిజంగానే ఫిదా చేశారు. భానుమతి ఒక్కటే పీస్ అంటూ తెలంగాణ స్టైల్ లో ఆమె పలికిన డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
#SaiPallavi as a KA Paul 🏃♀️🏃♀️🏃♀️🤣😂🤣🤣 pic.twitter.com/7BdzdKKEA0
— Swaasthi (@swaasthi) February 21, 2026
ఆ తర్వాత నానితో ఎంసీఏ సినిమా చేశారు. శర్వానంద్ తో పడిపడిలేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, అమరన్, తండేల్ లాంటి చిత్రాలలతో వరుస బ్లాక్ బస్టర్స్ సాధించారు సాయి పల్లవి. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన రామాయణం చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో సీతగా నటిస్తున్నారు. అయితే అమరన్ లో ఆమె నటనకు గాను ఇటీవల ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా ఎంపికయ్యారు సాయి పల్లవి.

అయితే ప్రస్తుతం సాయి పల్లవికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ షూటింగ్ విరామ సమయంలో ఆమెను కొందరు ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఫోటోలు, సెల్ఫీలు అంటూ ఇబ్బంది పెట్టారు. దాంతో వారినుంచి తప్పించుకునేందుకు ఆమె రన్నింగ్ చేయడం ప్రారంభించారు. అలా పరిగెత్తుకుంటూ కారులోకి వెళ్లారు. దాంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#SaiPallavi : Tamil Telugu Malayalam
— Swaasthi (@swaasthi) February 21, 2026
All Languages available🤣😂🤣😂🤣 pic.twitter.com/4zgGEiSg1m
ఇక ఇటీవలికాలంలో సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ వారిమీద పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఇటీవలికాలంలో మరింతగా పెరిగాయి. నిధి అగర్వాల్, సమంత కు ఇలానే జరిగింది. అంతేకాక ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కూతురు క్లింకారతో వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఎదురైంది.












Click it and Unblock the Notifications