స్టార్ హీరో మూవీ థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. కానీ ఓటీటీలో ఫుల్ ట్రెండింగ్ !
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి దేశ విదేశాల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1988లో Biwi Ho To Aisi అనే చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. 1989లో వచ్చిన మైనే ప్యార్ కియా సినిమాతో స్టార్‌గా మారిపోయారు. ఆ తర్వాత హమ్ ఆప్కే హై కౌన్, కరణ్ అర్జున్, జుడ్వా, ప్యార్ కియా తో డర్నా క్యా, తేరే నామ్, వాంటెడ్, దబాంగ్, బజరంగీ భాయిజాన్, సుల్తాన్, కిక్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో తన సూపర్ స్టార్ స్టేటస్‌ను నిలబెట్టుకున్నాడు.
కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, టీవీ హోస్ట్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా Bigg Boss రియాలిటీ షో హోస్ట్‌గా ఎంతో క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం 50 ఏళ్ల వయస్సు దాటినా ఇప్పటికీ ఎనర్జీ తగ్గకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. హిట్స్-ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన స్టైల్‌లో కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే మురుగదాస్ దర్శకత్వంలో "సికిందర్" అనే భారీ యాక్షన్ సినిమా చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, సల్మాన్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

అయితే ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో.. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందుకు తగ్గట్టే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి.
మరోవైపు థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు మాత్రం ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఊహించని రేంజ్ లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సత్తా చాటుతున్నాయి. అయితే ఓ సినిమాను తెరకెక్కించడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. స్టార్ హీరోహీరోయిన్లను ప్రధాన పాత్రలతో రెండు దశాబ్దాలపాటు చిత్రీకరణ జరిగింది. చివరకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అదే సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "వీర్". ఇందులో జరీనా ఖాన్ కథానాయికగా నటించింది. ఈ మూవీ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. 2010లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. బ్రిటిష్ వలస పాలకులకు లొంగిపోవడానికి నిరాకరించే పిండారీల అనే గిరిజనుల కథను ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. దాదాపు 63 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.43 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది.
అయితే ఈ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో జరీనాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హిందీలో హౌస్ ఫుల్ 2, వాజా తుమ్ హో వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఈ సినిమా.
-
ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ..? -
క్లిక్స్ కోసం ఇంత నీచమా?: సోదరుడి కోసం రంగంలోకి స్టార్ హీరోయిన్! -
ప్రియాంక బెడ్రూమ్ సీక్రెట్స్ లీక్: బయటపెట్టిందెవరో తెలిస్తే షాకవుతారు! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్












Click it and Unblock the Notifications