సమంత , నాగ చైతన్యలను కలపడానికి పెద్ద ప్లాన్ వేశారే..!

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.

అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

Samantha and Naga Chaitanya meet for the first time after divorce

అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదిస్తున్నారు.

విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తీసుకున్న తరువాత ఈ జంట నేరుగా కలిసింది లేదు. కానీ తాజాగా వీరిద్దరు కలిసి ఒకే వేదికపై దర్శనం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వీరిద్దరు కలిసి నటించిన తొలి సినిమా ఏ మాయ చేశావే. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2010లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా.. నాగ చైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది.

సమంతకు సైతం నటించిన తొలి సినిమానే హిట్ కావడం , ఆమె కెరీర్‌కు ఫ్లస్ అయింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఈ సినిమా వ‌చ్చి 15 ఏండ్లు అవుతున్న సంద‌ర్భంగా మేక‌ర్స్ రీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 18న రీ-రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో విడాకుల తర్వాత తొలిసారి వీరిద్దరు నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్లీ సమంత చైతన్యను ఒకే ఫ్రేమ్‌లో చూస్తున్నామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి వారిద్దరూ ప్రమోషన్లలో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+