అలా ఉంటే జీవిత భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది: సమంత
దక్షిణాది బ్యూటీ సమంత గురించి పరిచయం అవసరంలేదు. ఆమె గురించి దేశంలోనే తెలియనివారు లేరు. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్లను కూడా తోసిరాజని రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయనప్పటికీ దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇటీవలే వచ్చిన సిటాడెల్ రీమేక్ వెబ్ సిరీస్ హనీబన్నీతో ఆకట్టుకుంది. వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఓహో అనిపించింది. ప్రస్తుతం మాఇంటి బంగారం పేరుతో ఓ సినిమా, రక్త్ బ్రహ్మాండ్ పేరుతో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఇటీవలి కాలం నుంచి ఎక్కువగా ముంబయిలోనే నివసిస్తోంది. హైదరాబాద్ రావడం తగ్గించేసింది. అందుకు తగినట్లుగానే ఆమెకు తెలుగులో అవకాశాలు రావడంలేదా? లేదంటే తానే ఒప్పుకోవడంలేదా? అనేది తెలియాల్సి ఉంది.
అలా వెళ్లడం సాధారణమైన విషయం కాదు
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత పరోక్షంగా చాలాసార్లు అతనిపై సెటైర్లు వేయడం, వ్యాఖ్యలు చేయడం చేసింది. ఆమె మాట్లాడేది తన గురించే అని నాగచైతన్యకు తెలిసినప్పటికీ అతను ఏనాడూ ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. ఈ విషయంలో అభిమానులంతా నాగచైతన్యను మెచ్చుకున్నారు. సమంత తొందరపడి మంచి కాపురాన్ని చెడగొట్టుకుందని, అక్కినేని లాంటి కుటుంబంలోకి కోడలిగా వెళ్లడం అంటే సాధారణమైన విషయం కాదంటున్నారు నెటిజన్లు. ఏదేశమైనప్పటికీ శోభిత ధూళిపాళ చాలా అదృష్టవంతురాలంటున్నారు.

సమంత చెప్పింది అతన్ని గురించేనా?
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమంత ఒక ఇంటర్వ్యూకి హాజరై చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని, శారీరకంగాకానీ, మానసికంగా కానీ మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పింది. అలా లేకపోతే మీ భాగస్వామికి నచ్చినట్లుగా మీరు కనిపించలేరని, భాగస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. అందంగా కనిపించినా, మానసికంగా ప్రశాంతంగా ఉండరంది. ఈ విషయాన్ని మీరు గుర్తించలేకపోతే మీ భాగస్వామిని మీరు కోల్పోతారని ఆ ఇంటర్వ్యూలో సమంత వెల్లడించింది. ప్రేమికుల రోజును పురస్కరించుకొని తాను చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు సమంత చెప్పింది నాగచైతన్య గురించే అని అభిప్రాయపడుతూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications