భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తారు... సమంత సంచలనం

తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య , సమంత కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏమాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో ఆగస్టు 8న నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది.

Samantha likes a post about marriage

ఇదే సమయంలో సమంత రెండో పెళ్లి గురించి అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. సమంత ఓ స్టార్ దర్శకుడుతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు . రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది.

త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన సిటాడెల్ సినిమాకు సైతం రాజు నిడుమోరునే దర్శకత్వం వహించారు. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఈ జంట కలిసి దర్శనం ఇస్తున్నారు. ఆదివారం సమంత తిరుమలకు వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌కు లైక్ కొట్టారు.

Samantha likes a post about marriage

ఆ పోస్ట్ లో ఏముందంటే.. భార్యలు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే.. భర్తలు వారిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సర్వేలో తేలిందట. భార్యలు ప్రాణాంతకమైన అనారోగ్యానికి గురైతే 21 శాతం మంది భర్తలు వారి నుంచి విడిపోతున్నారట. అదే భర్తలు ప్రాణాంతకమైన వ్యాధికి గురైతే భార్యలు విడిపోవాలనుకునే శాతం 2.9 శాతం మాత్రమే అని సర్వేలో తేలిందట. భార్యలు అనారోగ్యంతో ఉంటే వారి నుంచి విడిపోవాలనుకునే భర్తలు ఎక్కువ.

కానీ భర్తలు అనారోగ్యంతో ఉంటే వారితో కలసి జీవించే భార్యలు ఎక్కువ అని తేలింది.ఈ పోస్ట్‌ను సమంత లైక్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సమంత రెండో పెళ్లికి రెడీ అవుతుందనే చర్చ సాగుతుంది. విడాకుల అనంతరం సమంత అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తన ఆరోగ్యం గురించి అన్ని తెలిసిన వ్యక్తిని సమంత పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవమో తెలియదు. ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు వ్యవహారం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+