ప్రెగ్నెన్సీలోనూ సమంత రిస్క్... సామ్ ఎనర్జీ నెక్ట్స్‌ లెవల్‌ అంతే!

టాలీవుడ్ అగ్రనటి సమంత రూత్ ప్రభు ఇటీవల గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఇంటి పట్టునే ఉంటూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ వరకు ప్రతి క్షణాన్ని గుర్తుగా ఉంచుకునేందుకు సమంత - రాజ్ దంపతులు తాపత్రయపడుతున్నారు. సమంత మాత్రం గర్భంతో ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడటం లేదని ఆమెను చూస్తే అర్ధమవుతోంది. తాజాగా సోషల్ మీడియాలో సామ్ పెట్టిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

హీరో అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడ్డారు సామ్. కొన్నాళ్లు డేటింగ్ తర్వాత ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం సమంతకు ఎంతో ఇష్టమైన సద్గురు జగ్గీవాసుదేవ్‌కు చెందిన కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో రాజ్‌ను తన జీవితంలోకి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి లింగ భైరవి అమ్మవారి ఆధ్వర్యంలో పురాతన భూతశుద్ధి ప్రక్రియ ద్వారా రాజ్- సమంతలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

Samantha Ruth Prabhu Plays Pickleball With Raj Nidimoru During Pregnancy Video Goes Viral

పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగించాలన్న సమంత నిర్ణయానికి రాజ్ పూర్తిగా సహకరిస్తున్నారు. తమ సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ కింద తెరకెక్కించిన మా ఇంటి బంగారం సినిమాలో సమంత లీడ్ రోల్‌లో నటించారు. ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగానే కాకుండా క్రియేటివ్ హెడ్‌గానూ రాజ్ వ్యవహరించి.. భార్యకు అన్నిరకాలుగా అండగా నిలిచారు. మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సమయంలోనే తాను గర్భం దాల్చినట్లు అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు సామ్.

ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినప్పటికీ అభిమానులతో నిత్యం సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటున్నారు. బుక్స్ చదవడం, బిడ్డకు సంబంధించిన అన్నింటినీ సమకూర్చడంతో పాటు గర్భాధారణ సమయంలో మనసును, శరీరాన్ని ఎలా ఫిట్‌గా ఉంచుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు సమంత. నిజానికి తాము పిల్లల గురించి ఎలాంటి ప్లాన్ చేసుకోలేదని.. గర్భం దాల్చడం తన జీవితంలో పెద్ద సర్‌ప్రైజ్ అని సమంత ఎమోషనల్ అవుతున్నారు. రాజ్ కూడా ఈ సమయంలో ఆమెకు తోడుగా నిలుస్తున్నారు.

గర్భం దాల్చిన స్త్రీలు సాధారణంగా ఇంట్లోనే ఉంటారు.. కుటుంబ సభ్యులు కూడా వారికి కాలు కిందపెట్టకుండా చూసుకుంటారు. కానీ సమంత మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఈ టైంలోనూ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. ఇక తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. బలంగా షాట్స్ ఆడుతూ, ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సమంతకు నెటిజన్లు జాగ్రత్తలు చెబుతూనే ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+