నేను విడాకులు తీసుకుంటే వాళ్లు పండుగ చేసుకున్నారు - సమంత
సినీ పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందుతున్న సమంత రూత్ ప్రభు జీవితం ఎప్పుడూ ఒక తెరిచిన పుస్తకమే. ఆమె వ్యక్తిగత విషయాలు, ప్రేమ, నాగ చైతన్యతో వివాహం, విడాకుల అంశాలు ఇప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి. చైతన్య తన జీవితాన్ని, కెరీర్‌ను అద్భుతంగా కొనసాగిస్తున్నట్లే, సమంత కూడా ఇకపై తన జీవితాన్ని తనకు నచ్చిన రీతిలో మలచుకోవడానికి సిద్ధమవుతోంది.
సమంత రెండవ పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు, వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నట్లుగా వస్తున్న కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

నేను కెరీర్ పరంగా ఎత్తుపల్లాలు చూసినప్పుడు చాలా మంది నన్ను చూసి నవ్వారు. ఇక నాకు మాసోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా మాజీ భర్తతో విడాకులు తీసుకున్నప్పుడు నన్ను ద్వేషించే ఎంతోమంది సంబరాలు చేసుకున్నారు. నా జీవితం ఎలా ఉండబోతుందో వాళ్లే నిర్ణయించి సోషల్ మీడియాలో రాసేవారు. మొదట్లో ఇవన్నీ చూసి చాలా బాధపడ్డాను, కానీ మెల్లగా పట్టించుకోవడం మానేశాను" అంటూ సమంత తన ఆవేదనను వెల్లడించింది.
ఆమె అభిమానులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఒక స్త్రీ విడాకులు తీసుకున్నప్పుడు మానసిక వేదనతో పాటు సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చే మాటలే మనిషికి మానవత్వం. కానీ సమంత విషయంలో అది లోపించిందని ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు.
కెరీర్ పరంగా సమంత తన పంథాను మార్చుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే ఎంచుకుంటూ ఆచి తూచి అడుగులు వేస్తోంది. అంతేకాదు, తన అభిరుచికి తగ్గట్టుగా 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా నిర్మించిన మొదటి చిత్రం 'శుభమ్' ఈ ఏడాది విడుదలై సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మిస్తున్న 'మా ఇంటి బంగారం' చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications