సమంత ఇంట్లో తీవ్ర విషాదం

సినీ నటి సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణంతో సమంత తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో హృదయం బద్ధలైన ఎమోజీని షేర్ చేస్తూ నాన్నా.. మళ్లీ మనం కలిసేంతవరకు అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో సమంత స్నేహితులు, ఆమె సన్నిహితులతోపాటు పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని, అందుకు తీవ్రంగా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. సినీరంగానికి చెందిన సెలబ్రిటీలంతా ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు.

తల్లిదండ్రుల పాత్రను వెల్లడించిన సమంత
గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గురించి వెల్లడించారు. చిన్నతనంలో తనకు ప్రత్యేక గుర్తింపు కావాలనే కోరికతో ఎంతో ప్రయత్నించేదానన్నని, అందుకు పోరాటం చేసేదాన్నని తెలిపింది. అయితే తన తండ్రి మాత్రం తాను ఏమీ తెలియని అమాయకురాలినని భావించేవారని, తనను ఒక చిన్నపిల్లలా చూసేవారని చెప్పారు. తన నాన్న ఒక్కరే కాదని, భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులంతా తమ పిల్లలకు ఎంత వయసు వచ్చినా వారికేమీ తెలియని అమాయకుల్లానే భావిస్తారన్నారు. తన జీవితంపై తండ్రి ప్రభావం ఎంతో ఉందన్నారు. ఆయన చెప్పిన మాటలు తన జీవితానికి స్ఫూర్తిగా నిలిచేందుకు ఉపయోగపడ్డాయన్నారు.

samantha ruth prabhu s father joseph prabhu passes away

తనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవారు
తనకు తొలిసారిగా సినిమాలో అవకాశం వచ్చినప్పుడు చేయలేనని భావించానని, కానీ సినిమా విడుదలైన తర్వాత తండ్రి నుంచి వచ్చి ప్రశంసలు మరిచిపోలేనివని, వాటిని అంగీకరించడానికే చాలా సమయం పట్టిందన్నారు. ఆ తర్వాత నుంచే తాను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నానని, నటిగా రాణించిన తనను చూసి తన తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారని సమంత చెప్పారు. తాను చేసే పని విషయంలో వారు ఎంతో సంతృప్తి చెందేవారన్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తండ్రి మానసికంగా ఎంతో కుంగిపోయారు. ఆయన నాగార్జునను కలిసి మాట్లాడారు. సమంతకు తన తండ్రికి ఆ సమయంలో ఎంతో ధైర్యం చెప్పారు.

samantha ruth prabhu s father joseph prabhu passes away
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+