వారు హాస్పటల్‌కు కూడా తీసుకువెళ్లలేదు: సమంత భావోద్వేగం

ఏడాదిన్నర నుంచి ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా, నెంబర్ వన్ కథానాయికగా కొనసాగుతోంది ముద్దుగుమ్మ సమంత. ఇటీవలే ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. మయోసైటిస్ కు చికిత్స తీసుకోవడం కోసం సినిమాలకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాలు చేయడానికి నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగిచ్చేసింది. చికిత్స తీసుకుంటూ దేశాలు చుట్టివచ్చింది. తాను ఏ సమయంలో ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా తన విషయాలన్నింటినీ సామాజిక మాధ్యమాలద్వారా అభిమానులతో పంచుకునేది.

భావోద్వేగానికి గురైన సమంత
హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన సిటాడెల్ వెబ్ సిరీస్ ను హిందీలో హన్నీ బన్నీ పేరుతో నిర్మించారు. ఇందులో సమంత కథానాయికగా నటించింది. దీనికి సంబంధించి ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీగా ఉంటోంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సామ్ భావోద్వేగానికి లోనైంది. మయోసైటిస్ తనకు సోకినప్పుడు దానికి చికిత్స ఎక్కడ దొరుకుతుందనే విషయం తెలియలేదని, ఒక్కసారిగా తాను గతం అంతా మర్చిపోయినట్లైందని, మతిమరపు వచ్చినట్లై చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఆ సమయంలో తనను ఎవరూ ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Samantha said that when she got myositis no one even took her to the hospital

కనీసం ఎవరూ అడగలేదు
ఎలా ఉన్నారు సమంత అని ఒక్కరు కూడా పలకరించలేదని, ఎవరూ కనీసం అడగలేదని వ్యాఖ్యానించింది. తాను సిటాడెల్ సెట్స్ పైకి వచ్చేవరకు నిర్మాత, దర్శకులు ఎదురుచూసినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. తాను చేయను అన్నప్పటికీ వారు పట్టుబట్టి చేయించారని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన సొంత బ్యానర్ లో మాఇంటి బంగారం పేరుతో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. హీరోగా ప్రియదర్శి నటిస్తున్నారు. తర్వాత ఓ వెబ్ సిరీస్ ఒప్పుకుంది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించాలని కోరారు. దీనిపై సమంత ఇంకా ఏ నిర్ణయాన్నీ చెప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+