ఇక్కడితో ఏమీ అయిపోలేదు.. ఏం జరుగుతుందో మీరే చూస్తారు: సమంత
భారతదేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ సమంత చెలామణి అవుతోంది. రెండు సంవత్సరాలకు పైగా ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ ఆమె దీపికా పదుకొనే, అలియా భట్ లాంటివారిని వెనక్కినెట్టి మరీ మొదటిస్థానంలో ఉండటం అంటే సాధారణమైన విషయం కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత అది మంచి విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ తోపాటు మాఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది.
వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల తర్వాత
గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంతను విలేకరి ఓ ప్రశ్న అడుగుతాడు. క్లిష్ట సమయాలను మీరు ఎలా ఎదుర్కొన్నారు? అని. అందుకు సమంత బదులిస్తూ ఇంతటితో ఏమీ అయిపోలేదని, మున్ముందు చాలా ఉందని, బలంగా తాను పైకి లేస్తానని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనప్పటికీ షూటింగ్ లో అవేవీ కనపడనీయకుండా అద్భుతంగా నటించిందని అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్ చెప్పారు. ఆమె నుంచి తాము ఎంతో స్ఫూర్తి పొందేవారిమన్నారు. సమంత చేసిన వ్యాఖ్యలు నాగచైతన్య గురించే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సమంత ఆ అవకాశాన్ని నిలుపుకోలేకపోయింది
నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత మయోసైటిస్ కు గురైన సమంత సినిమాలకు విరామం ప్రకటించింది. రెండు సంవత్సరాలకు పైగా విరామం రావడంతో సినిమాల్లో అవకాశాలు రావడంలేదు. దీంతో వెబ్ సిరీస్ లపై దృష్టిసారించింది. హైదరాబాద్ లో నివసించడం కూడా చాలావరకు తగ్గించి ముంబయిలోనే ఎక్కువగా నివసిస్తోంది. నాగచైతన్య శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇటీవలే తండేల్ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. శోభితను చేసుకున్న తర్వాత నాగచైతన్యకు బాగా కలిసివచ్చిందని, అక్కినేనిలాంటి కుటుంబంలోకి కోడలిగా వెళ్లిన తర్వాత ఆ అవకాశాన్ని సమంత నిలుపుకోలేకపోయిందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications