అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించినా సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక 2010లో ఏమాయె చేశావే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సమంత. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో మెప్పించింది. అటు తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను ఏర్పరుచుకుంది. ఇక అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ వివాహం చేసుకుంది సమంత. వీరి వివాహం 2017 అక్టోబర్ లో జరిగింది. అయితే 2021 లో వ్యక్తిగత కారణాలతో ఈ దంపతులు విడిపోయారు.
అనంతరం గతేడాది డిసెంబర్ లో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది సమంత. అయితే ఇండస్ట్రీలో సమంతకు చాలామందే ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తో సమంత క్లోజ్ గా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంటుంది. కీర్తి సురేశ్ లీడ్ రోల్ లో నటించిన మహానటి చిత్రంలో సమంత ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల గలాటా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ గురించి ఎవరికీ తెలియని విషయాలను సమంత బయటపెట్టింది.

కీర్తి సురేశ్ గురించి మాట్లాడుతూ సమంత కీలక విషయాలను వెల్లడించింది. అర్ధరాత్రి 2 గంటలకు కూడా కీర్తి సురేశ్ ఎంతో సరదాగా.. ఫన్నీగా మాట్లాడుతుందని తెలిపింది. ఆ సమయంలోనూ కీర్తి సురేశ్ ఎంతో ఉత్సాహంగా ఉంటుందని అందరినీ నవ్విస్తుందని వివరించింది. ఆమె నవ్వులు తట్టుకోలేక మీరు పరిగెత్తాలని.. అయితే ఆమె డ్రింక్స్ తీసుకోవడమే.. ఇంకో విధంగానో కాదని సమంత తెలిపింది. ఆ సమయంలోనూ కీర్తి సురేశ్ హైపర్ మ్యాక్స్ మోడ్ లో ఉంటుందని.. అంతేకాక ఆమె మనల్ని 0.03 సెకన్స్ లోనే డిస్ట్రాయ్ చేస్తుందని సమంత ఫన్నీ కామెంట్స్ చేసింది. కీర్తి సురేశ్ కు అత్యద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని పేర్కొంది. ఆమె చాలా బెస్ట్.. అంటూ సమంత ప్రశంసించింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications