మాది విడదీయరాని బంధం: సమంత సంచలన పోస్ట్
రెండున్నర సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ దేశంలో ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది అందాల తార సమంత. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వివరాలను పోస్ట్ చేస్తుంటుంది. తాను ఎక్కడకు వెళ్లింది, ఏం చేస్తుంది తదితర వివరాలపై అభిమానులకు అప్ డేట్ ఇస్తుంటుంది. సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ లో నటనకు ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. అలాగే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమెను జీ తెలుగు ఛానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు.
తొలి సినిమాగా శుభం
జీ తెలుగు ఛానల్ తరఫున ఉత్తమ నటి అవార్డు రావడంతో తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కుక్క, పిల్లి ఫొటోలు పెట్టి తనతో అవి విడదీయరాని బంధం అంటూ రాసుకొచ్చారు. దీనికి క్యాప్షన్ కూడా పెట్టారు. 'విస్తృతంగా మేల్కొని కలలు కనడం' అని పేర్కొన్నారు. పలు ఫొటోలను కూడా సమంత షేర్ చేశారు. ఇటీవలే నిర్మాతగా మారిన సమంత తొలి సినిమాగా శుభం ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది.

అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది
సమంత కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలో మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. ఇందులో హీరోగా ప్రియదర్శి నటిస్తున్నారు. ట్రూలాలా బ్యానరుపై దీన్ని సామ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల కానుంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ హైదరాబాద్ లో కన్నా ముంబయిలోనే ఎక్కువగా ఉంటోంది. తనతో వెబ్ సిరీస్ తీసిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేల్లో ఒకరైన రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ముంబయిలో ఈ జంటే కనిపిస్తోంది. రాజ్ భార్య శ్యామలి 'అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది' అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రాయడం కూడా సంచలనాన్ని కలిగిస్తోంది. గతంలో కూడా వీరి బంధంపై ఆమె పరోక్షంగా పోస్టులు పెట్టారు.












Click it and Unblock the Notifications