సంచలన నిర్ణయం తీసుకున్న సమంత..గుడ్ బై చెప్పేసిందిగా..!
టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలను చెరిపేసి, కేవలం తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్న నటి సమంత రూత్ ప్రభు. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలలో నటించి, ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'జెస్సీ' పాత్రలో ఆమె చూపించిన అభినయం, అమాయకత్వం యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 'దూకుడు', 'ఈగ', 'అత్తారింటికి దారేది' వంటి వరుస విజయాలతో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 'మనం', 'రంగస్థలం', 'మజిలీ', 'ఓ బేబీ' వంటి చిత్రాలు ఆమె నటనకు మరో నిదర్శనంగా నిలిచాయి. తమిళంలోనూ 'తేరి', 'మెర్సల్' వంటి పెద్ద చిత్రాలలో భాగమై, తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు.

హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంత, ఇండస్ట్రీలో ఒక ఆదర్శ జంటగా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు, వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వారిద్దరి మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అటు నాగ చైతన్య శోభితను వివాహం చేసుకోగా, సమంత మాత్రం ఒంటరిగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
కొంతకాలం పాటు 'మయసైటీస్' అనే అరుదైన వ్యాధితో బాధపడిన సమంత, సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ దశలో ఆమె చూపించిన ధైర్యం, పోరాట పటిమ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకుని, మళ్లీ సినిమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టి, కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
తాజాగా సమంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సినిమాలను తగ్గించేయాలని ఆమె భావిస్తోంది. దీనిపై సమంత మాట్లాడుతూ..గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పిన సమంత, ఇప్పుడు తన జీవితంలో శారీరక, మానసిక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని స్పష్టం చేశారు.
గతంలో మాదిరిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండకుండా, తన శరీరం చెప్పే మాట విని, తక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా, నాణ్యతలో మాత్రం రాజీ పడనని, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలనే ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications