పెళ్లి విషయంలో తొందరపడి జీవితం ఆగం చేసుకున్నా ..సమంత సంచలన పోస్ట్
హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగ చైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకున్నారు. వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించారు.

విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తీసుకున్న తరువాత ఈ జంట నేరుగా కలిసింది లేదు. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన పెళ్లి విషయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లిపై షాకింగ్ పోస్ట్‌ను షేర్ చేసింది.
ముప్పై ఏళ్ల తర్వాత, మీ మెరుపు, మీ అందం తగ్గుముఖం పడతాయి. అందుకే జీవితాన్ని ఆస్వాదించాలంటే 20 ఏళ్లలోపే ఏదైనా సాధించాలి. నాకు ఇరవైలలో ఉన్నప్పుడు విశ్రాంతి లేకుండా గందరగోళంగా గడిపాను. గుర్తింపు కోసం ఆరాటపడ్డానని సమంత చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నన్నే నేను ఎంత కోల్పోయానో ఎవరికీ తెలియదు. ఏదీ కనిపించకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాను. ఆ సమయంలో, ప్రేమ గురించి అప్పుడు నాకెవరూ చెప్పలేదు. నిజమైన ప్రేమ మనలోనే ఉంటుందనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని తర్వాత అర్థం చేసుకున్నా అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications