బాలయ్యకు హీరోయిన్ దొరికేసింది.. ఇక రచ్చ రచ్చే

నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో వచ్చి హిట్ కొట్టారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో బాబీ దేవోల్ విలన్ పాత్రలో అలరించారు. ఊర్వశి రౌతెలా, ప్రజ్ఞ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, రిషి, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటించారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' తర్వాత బాలయ్యకు ఈ సినిమా వరుసగా నాలుగో హిట్ కావడం విశేషం.

ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బోయపాటి, బాలయ్య కాంబో అంటేనే బ్లాక్ బస్టర్ అని ఇప్పటికే రిలీజైన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలతో నిరూపించారు. అయితే మరోసారి క్రేజీ కాంబో రిపీట్ కానుంది. 'అఖండ 2'ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బోయపాటి ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు. రామ్ తో తీసిన 'స్కంద' మూవీ డిజాస్టర్ కావడంతో ఈసారి ఎలాగైనా కమ్ బ్యాక్ ఇవ్వాలని కసిగా ఉన్నారు.

Samyukta Menon to Star as Female Lead in Boyapati-Balayya s Akhanda-2

ఇటీవల కుంభమేళా లో పాల్గొన మూవీ టీం అక్కడ పలు సన్నివేశాలను షూట్ చేసింది. అయితే తాజాగా అఖండ 2 సినిమాలో హీరోయిన్ ను ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమాలో కథానాయికగా టాలెంటెడ్ యాక్ట్రెస్ సంయుక్త మీనన్ ను తీసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 'టాలెంటెడ్ నటి సంయుక్తకు అఖండ 2 ప్రాజెక్ట్​లోకి స్వాగతం​. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్​గా రిలీజ్ కానుంది' అని మేకర్స్​ పోస్ట్ చేశారు.

సంయుక్తా మేనన్ 'విరూపాక్ష', 'డెవిల్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ కోసం బోయపాటి శక్తివంతమైన మహిళా పాత్రను రాసినట్లు తెలుస్తోంది. ఇక 'అఖండ 2' ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానున్నట్లు ఇదివరకే మూవీ టీమ్ చెప్పింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. నందమూరి తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+