స్టార్ హీరో పర్సనల్ ఫోటోలు వైరల్, ఎంత వద్దనుకుంటున్నా వెంటాడుతున్న వివాదాలు!

స్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్, డీ బాస్ దర్శన్ కు వివాదాలు చుట్టుముడుతున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలని హీరో దర్శన్ ఎంత జాగ్రత్తపడినా వివాదాలు మాత్రం వీళ్లను వదిలిపెట్టడం లేదు. కొద్దిరోజుల క్రితం హీరో దర్శన్ కుటుంబ విషయం మళ్లీ వీధిలోకి వచ్చింది. దర్శన్ బార్య విజయలక్ష్మి, నటి పవిత్రా గౌడలు సోషల్ మీడియాలో వార్ మొదలు పెట్టడంతో దర్శన్ అభిమానులు హడలిపోయారు.

ఈ వివాదం చల్లారుతుండగానే మరో ఫోటోను దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి వాటిని వైరల్ చేశారు. నటి పవిత్ర గౌడ హీరో దర్శన్ తో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ బంధం 10 ఏళ్ల నాటిదని కూడా పవిత్రా గౌడ సోషల్ మీడియాలో రాయడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది. అందులోని ఫోటో ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చెయ్యడంతో అది వైరల్ అయ్యింది. ఇదే సమయంలో హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి నటి పవిత్రా గౌడ తీరుపై మండిపడ్డారు.

Sandalwood hero Darshans family photos are once again going viral on social media

పరాయి స్త్రీ మొగుడితో కలిసి సిగ్గులేకుండా ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడానికి కొంచెం అయినా మానం మర్యాద ఉండాలి అంటూ హీరో దర్శన్ భార్య నటి పవిత్రా గౌడపై పరోక్షంగా మండిపడ్డారు. తరువాత విజయలక్ష్మి, నటి పవిత్రా గౌడల మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ ల వార్ నడిచింది. దర్శన్ భార్య విజయలక్ష్మి, నటి పవిత్రా గౌడల రాద్దాంతంలో దర్శన్ అభిమానులు కొందరు విచారం వ్యక్తం చెయ్యగా కొందరు మాత్రం మా బాస్ కాపురం సంతోషంగా ఉండాలని పోస్టు చేశారు.

కొన్ని రోజులు నటి పవిత్రా గౌడ్, హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి ఇద్దరూ మౌనంగా ఉన్నారు. అయితే పవిత్రా గౌడ తరచూ తన ఫోటోలు, ఆమె పనికి సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చూస్తూనే ఉంది, దర్శన్ భార్య విజయలక్ష్మి మాత్రం మౌనంగా ఉండిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే విజయలక్ష్మి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం లేదు. ఇటీవల హీరో దర్శన్ ఓ హెయిర్ స్టైలిస్ట్ పెళ్లికి వెళ్లాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అప్పుడు కూడా దర్శన్ భార్య విజయలక్ష్మి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కాగా విజయలక్ష్మి, ఆమె సన్నిహితులు దర్శన్‌తో కలిసి దిగిన ఫొటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటోలో విజయలక్ష్మి హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు జరిగిన గొడవలు అన్ని మరిచిపోయి విజయలక్ష్మి రిలాక్స్ అయ్యారా? అనే ప్రశ్నలకు ఈ ఫోటో సమాధానమా? అని చర్చ మొదలైయ్యింది.

Sandalwood hero Darshans family photos are once again going viral on social media

కొన్ని రోజుల క్రితం విజయలక్ష్మి, నటి పవిత్రా గౌడల మధ్య జరిగిన హంగామా తర్వాత తీసిన ఫోటోనా? లేక వేరే టైమ్ లో తీసిన ఫోటోనా అని దర్శన్ అభిమానులు చర్చ మొదలుపెట్టారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ ఫోటోను దర్శన్ ఫ్యాన్స్ షేర్ చేశారు. ఆ ఫోటోల మీద ఎవరి కళ్లూ పడకూడదని, మా అన్నవదిన మీద వీళ్ల కన్ను పడకుండా ఉండాలని హీరో దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇటీవల హంపీ ఉత్సవాలకు వెళ్లిన హీరో దర్శన్ అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత బెంగళూరులోని చామరాజ్ పేట్ ఎమ్మెల్యే, కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ను హీరో దర్శన్ పొగుడుతూ పాట పాడారు. మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ ను పొగడంతో దెబ్బకు హీరో దర్శన్ సోషల్ మీడియాలో ట్రోల్ కూడా అయ్యాడు కాటేరా సినిమా మెగా సక్సెస్ తర్వాత దర్శన్ డెవిల్ సినిమా పనులకు సిద్ధం అమవుతున్నాడని తెలిసింది అయితే ప్రస్తుతం ఈ డెవిల్ సినిమా గురించి చిత్ర బృందం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+