సైంటిఫిక్ మూవీ 'మాతృ'..థ్రిల్ కావడం పక్కా ..!

టాలీవుడ్‌లో సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది సెన్సేషనల్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ 'మాతృ'. హీరో శ్రీరామ్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా నటించిన ఈ సినిమాలో అలీ, ఆమని, రవి కాలె, పృథ్వీరాజ్, దేవి ప్రసాద్, నందినీ రాయ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి జాన్ జాక్కి రచన, దర్శకత్వం వహించారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కథనంతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే 'మాతృ' చిత్రం నుంచి విడుదలైన కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఆదిత్య మ్యూజిక్ ద్వారా మంచి ఆదరణ పొందింది.

scientific thriller movie Matru is set to have a grand release in theaters worldwide on August 8th

నిర్మాత బి. శివప్రసాద్ మాట్లాడుతూ, "మా బ్యానర్‌లో నిర్మించిన 'మాతృ' సినిమాను ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీగా 'మాతృ' మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. సినిమాకు థియేటర్లలో ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం" అని తెలిపారు.

రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ, బూర్లె హరిప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+