ఓటీటీలోకి యూత్ ఫుల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

'యాక్షన్ కింగ్' అర్జున్ దర్శకుడిగా మారి, తన కూతురు ఐశ్వర్యా హీరోయిన్‌ గా తెరకెక్కించిన మూవీ 'సీతా పయనం'.. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదలైంది. అయితే ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి టాక్ అంతగా పాజిటీవ్ రాకపోవడంతో కమర్షియల్‌గా ఫ్లాప్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ మూవీ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సన్ ఎన్‌ఎక్స్‌టీ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ఇక 'సీతా పయనం' మూవీ తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతోనే అర్జున్ కూతురు ఐశ్వర్య తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ముందు ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్‌ ను అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల అతను తప్పుకోవడంతో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది.

SeethaPayanam movie ott release OTT Premiere March 20 Streaming in Telugu amp amp Tamil on Prime Video

ఇక సీతా పయనం మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజు, సత్యరాజ్, కోవై సరళ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాను రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ సార్జా స్వీయ నిర్మాణంలో రూపొందించాడు. ఈ మూవీ యూత్ ఫుల్ లవ్ స్టోరీ అయినప్పటీ యువతను పెద్దగా అందుకోలేదనే చెప్పాలి. దాంతో బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ తెచ్చుకుందీ మూవీ. ఇక మార్చి 20 నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+