ఆరో ఏట నుంచే ఆ జబ్బుతో బాధపడుతున్నా.. సీక్రెట్ రివీల్ చేసిన సీనియర్ హీరోయిన్
సీనియర్ నటి సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1980లో తమిళ చిత్రం 'నెంజతై కిల్లతే' తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగులో సైతం అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, మురళి మోహన్, మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళం, తెలుగు భాషల్లోనే కాకుండా పలు భాషల్లో సైతం నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. ఇక 1988లో ఆమె ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహం చేసుకున్న సుహాసిని.. ప్రస్తుతం తల్లి, అతిథి పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు.
ఇక తన భర్త మణిరత్నంతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు సుహాసిని. రీసెంట్ గానే ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తనకు ఆరేళ్ళ వయస్సు ఉన్నప్పటి నుంచే ఓ జబ్బుతో బాధపడుతున్నా అంటూ సీక్రెట్ బయటపెట్టారు. బయటికి చెబితే పరువు పోతుందని ఎవరికీ చెప్పలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆమెకు ఏమైంది, అసలు ఏం జరిగింది అంటూ సుహాసిని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడుతూ ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే తనకు టీబీ ఉన్న విషయం బయటపడిందని చెప్పారు. కొన్నాళ్లకి అంతా సెట్ అయింది అనుకుంటే మళ్లీ 36 ఏళ్ల వయసులో మళ్లీ తిరగబడింది. భయంతో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను.. ఆరు నెలల పాటు చికిత్స కూడా తీసుకున్నానని తెలిపారు. ఈ కారణంగా ఒక్కసారిగా బరువు తగ్గిపోయానని.. 75 కిలో నుంచి 35 కిలోలకు తగ్గిపోయానని అన్నారు. అంతేకాకుండా వినికిడి శక్తి కూడా దెబ్బతిందని చెప్పారు. కానీ క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడంతో సమస్య తగ్గుముఖం పట్టిందని వ్యాఖ్యానించారు.
ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని చెప్పారెఊ సుహాసిని. తన వ్యాధి గురించి బయటకు తెలిస్తే పరువు పోతుందని బయటపడలేదని.. అందుకే ఎవ్వరికి తన వ్యాధి గురించి చెప్పలేదన్నారు. అయితే చాలా తప్పుగా ఆలోచించానని అనిపించిందని.. తాను పడిన ఒత్తిడిని ఎవరు పడోద్దని అనుకున్నానని చెప్పారు. దీంతో టీబీ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని దృఢంగా నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో సుహాసిని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
-
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications