బాలకృష్ణ-వెంకటేష్ మల్టీస్టారర్ ఖరారైనట్లే?
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ను బాపట్ల జిల్లా శింగరకొండలోని ప్రసన్నాంజనేయస్వామివారి దేవాలయంలోని స్వామి పాదాల చెంత ఉంచి పూజించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకీ భార్యగా, మీనాక్షి చౌదరి ఆయన ప్రియురాలిగా కనిపించబోతున్నారు. ఈనెల మూడోతేదీ నుంచి షూటింగ్ ప్రారంభించి నవంబరుకు పూర్తిచేస్తామని, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.

అరగంట సమయం యాక్షన్
ఈ సినిమా రెండో భాగంలో ఓ పవర్ ఫుల్ పాత్ర ఉందని అనిల్ చెప్పారు. మొదటి భాగం వరకు ఫన్ గా సాగుతూ వచ్చిన సినిమా రెండో భాగంలో ఈ పాత్ర ప్రవేశంతో అరగంట సమయం యాక్షన్ ఉంటుందని, ఆ పాత్రవల్ల థియేటర్ లో పూనకాలు వస్తాయని చెబుతున్నారు. ఈ పాత్రలో తాను నందమూరి బాలకృష్ణను మినహా ఎవరినీ ఊహించుకోలేకపోతున్నట్లు దర్శకుడు వెల్లడించారు. బాలయ్య ఓకే అంటే ఆయన చేత చేయించాలనే ఉద్దేశంలో అనిల్ ఉన్నారు.
బాలయ్య ఒప్పుకుంటే..
గతంలో బాలయ్య, వెంకీ కాంబినేషన్ లో సినిమాలు తీయాలని చాలామంది నిర్మాతలు, దర్శకులు ప్రయత్నించారుకానీ ఎవరూ తీయలేకపోయారు. ఇద్దరు అగ్ర హీరోల రెమ్యునరేషన్ తోపాటు చిత్రం బడ్జెట్ ఎక్కువవుతుందనే ఉద్దేశంతో వెనకడుగు వేశారు. అయితే సరైన కథలు కూడా దొరకలేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి బాలయ్య చేత చేయిస్తే బాలకృష్ణ-వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే చిత్రం ఇదే అవుతుందంటున్నారు. బాలయ్య, వెంకీ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. అన్ స్టాపపబుల్ షోకు వెంకీని కూడా బాలయ్య తీసుకొచ్చారు. మొదటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్ల బాలయ్య ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంటారే యోచనలో దర్శకులు అనిల్ ఉన్నారు. ఆయన కోరిక తీరుతుందేమో చూడాలి మరి.












Click it and Unblock the Notifications